సీసీ రోడ్డుపై మురుగునీరు పేరుకు పోతున్న చెత్తాచెదారం

23-10-2026 | 04:29pm

బోథ్. అక్టోబర్ 23 ( విజయక్రాంతి): మండలంలోనిమార్లపెల్లి గ్రామంలో(Marlapalli Village) ఉన్న సిసి రోడ్డుపై నుండి మురికి నీరు ప్రవహిస్తున్నది. అంతేగాక సీసీ రోడ్డు పైన చెత్తాచెదారం పేరుకుపోవడంతో పాటు అక్కడ పిచ్చి మొక్కలు మొరుస్తున్నాయని కాలనీవాసులు అంటున్నారు. సాయంత్రం అయిందంటే దోమల బాధ అధికమవుతున్నదని అధికారులు సీసీ రోడ్డు పైన ఉన్న చెత్తాచెదారాన్ని తొలగించాలని కోరుతున్నారు. పేరుకు సిసి రోడ్డు ఉన్నదని రోడ్డుపై మాత్రం మురికి నీరు చెత్త పేరుకుపోతున్నదని అంటున్నారు. అధికారులు స్పందించి సీసీ రోడ్డుపై మురుగునీరు పారకుండా, పిచ్చి మొక్కలను తొలగించాలని కోరుతున్నారు.

మరిన్ని వార్తలు