రోడ్డు మరమ్మతులు చేసుకున్న ఆదివాసీలు
బోథ్. అక్టోబర్ 2 (విజయక్రాంతి): సోనాల మండలంలోని మారుమూల ఆదివాసి గ్రామమైన మామిడి గూడ గ్రామానికి చెందిన ఆదివాసీలు చెడిపోయిన రోడ్డును గ్రామస్తులంక కలిసి మరమ్మతులు చేపట్టారు. గ్రామానికి వెళ్లే రోడ్డు గుంతల మాయం కావడంతో ద్విచక్ర వాహనాలపై వెళ్లేవారు కాలినడకన వెళ్లేవారు సైతం పలుమార్లు కిందపడడం వల్ల గాయాలు తగిలాయి.
దీంతో ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఎదురు చూడకుండా గ్రామానికి చెందిన ఆదివాసిలంతా ఏకమై అర కిలోమీటర్ వరకు రోడ్డుపైన గుంతలు పూడిచివేశారు. దీంతో గ్రామానికి వెళ్లేందుకు రోడ్డు మార్గం అనుకూలంగా మారింది. మరో అర కిలోమీటర్ రోడ్డు మరమ్మతులు చేసుకుంటామని గ్రామస్తులు తెలిపారు. అధికారులు నాయకులు పట్టించుకోకపోవడంతో గ్రామస్తులే ముందుకు వచ్చి రోడ్డు మరమ్మతులు చేసుకున్నారు. ఏదిఏమైనా ఆదివాసి గ్రామస్తులంతా ఏకమై రోడ్డు మార్గం మరమ్మతులు చేసుకోవడం ఆదర్శంగా నిలిచారు.