బీఆర్‌ఎస్ డబుల్ స్కెచ్!
- రెండు ఎమ్మెల్సీ స్థానాలు టార్గెట్
- సిట్టింగ్ కాపాడుకోవాలి.. పోయిన సీటు కొట్టేయాలి
- పట్టభద్రుల పోరుకు గులాబీ పార్టీ పక్కా ప్లాన్
- వరంగల్- రేసులో రాకేష్‌రెడ్డి?.. గత ఎన్నికల్లో రెండో స్థానం
- మహబూబ్‌నగర్ అభ్యర్థి ఎంపికపై కసరత్తు
- కొత్త ఓటర్ల నమోదుపై ముందుగానే గ్రౌండ్ వర్క్
హైదరాబాద్, అక్టోబర్ 1 (విజయక్రాంతి): తెలంగాణ రాజకీయాల్లో(Telangana Politics) ఉత్కంఠ రేపుతున్న రెండు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలను బీఆర్‌ఎస్(BRS) అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటోంది. వరంగల్- ఖమ్మం నల్లగొండ, మహబూబ్‌నగర్ పట్టభద్రుల నియోజకవరా ్గలకు జరగబోయే పోరులో సత్తా చాటేందుకు బీఆర్‌ఎస్ వ్యూహాత్మకంగా అడుగులో వేస్తోంది. ప్రస్తుతం తమ చేతిలో ఉన్న మహబూబ్‌నగర్ స్థా నాన్ని నిలబెట్టుకోవడంతో పాటు, గత ఎన్నికల్లో కోల్పోయి న వరంగల్ సీటును తిరిగి కైవసం చేసుకోవడమే లక్ష్యంగా పార్టీ అధిష్ఠానం ద్విముఖ వ్యూహానికి పదును పెడుతోంది.
ప్రస్తుతం మహబూబ్‌నగర్ పట్టభద్రుల స్థానానికి బీఆర్‌ఎస్‌కు చెందిన సురభి వాణీదేవి, వరంగల్‌కు కాంగ్రెస్ నేత తీన్మార్ మల్లన్న ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వీరిద్దరి పదవీకాలం 2027 మార్చితో ముగియనుంది. ఎన్నికల నగారా మోగడానికి ముందే రెండు నియోజకవర్గాల్లోనూ క్షేత్రస్థాయిలో రాజకీయ కార్యకలా పాలు ఊపందుకున్నాయి. సెప్టెంబర్ 28 నుంచే పట్టభద్రుల ఓటర్ల నమోదు ప్రక్రియ మొదలైన నేపథ్యంలో.. నవంబర్ 1, 2026 నాటి అర్హత ఆధారంగా బీఆర్‌ఎస్ నాయకత్వం ముందుగానే గ్రౌండ్ వర్క్ ప్రారంభించింది.
అభ్యర్థుల ఎంపికపైనా కసరత్తు ముమ్మరం చేసింది. ముఖ్యంగా మహబూబ్‌నగర్ స్థా నాన్ని బీఆర్‌ఎస్ అత్యంత కీలకంగా భావిస్తోంది. గత ఎన్నికల్లో సురభి వాణీదేవిని బరిలోకి దించి విజ యం సాధించింది. సీటు ను తిరిగి నిలబెట్టుకునేందుకు ఈ సారి కూడా అదే తరహా సమన్వయం, పటిష్ట వ్యూహంతో ముందుకెళ్లే ఆలోచనలో ఉంది.
బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇప్పటికే హైదరాబాద్, ఉమ్మడి రంగారెడ్డి, మహ బూబ్‌నగర్ జిల్లాల నేతలతో సమావేశమై ఎన్నికల సన్నద్ధతపై దిశానిర్దేశం చేశారు. అర్హులైన ప్రతి పట్టభద్రుడిని ఓటరుగా న మోదు చేయించే బాధ్యత తీసుకోవాలని ఆ యన పిలుపునిచ్చారు. సిట్టింగ్ ఎమ్మెల్సీ వా ణీదేవి మరోసారి పోటీ చేస్తారా? లేక కొత్త వ్యక్తిని రంగంలోకి దింపుతారా? స్పష్టత రావాల్సి ఉంది. అయితే ఈ స్థానం నుంచి బీసీ సామాజిక వర్గం నుంచి అభ్యర్థిని బరి దింపే అవకాశం ఉన్నట్టు తెలుస్తోం ది.
రాకేష్‌రెడ్డి వైపు మొగ్గు?
వరంగల్ పట్టభద్రుల నియోజకవర్గం విషయంలో బీఆర్‌ఎస్ వ్యూహం స్పష్టంగా కనిపిస్తోంది. ఏనుగుల రాకేష్‌రెడ్డిని మరోసారి బరిలోకి దించే అవకాశాలను పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. 2024 ఉపఎన్నికలో బీఆర్‌ఎస్ అభ్యర్థిగా పోటీ చేసిన రాకేష్‌రెడ్డి రెండో స్థానంలో నిలిచారు. కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్న విజయం సాధించినప్పటికీ రాకేష్‌రెడ్డి గణనీయమైన ఓటు బ్యాంకు సాధించారు. తాజా గా ఆయన అభ్యర్థిత్వం అధికారికంగా ఖరా రు కానప్పటికీ నియోజకవర్గంలో ఇప్పటికే ఆయన విస్తృతంగా పర్యటిస్తూ పట్టభద్రుల ను కలుస్తున్నారు.
2024 ఎన్నికల్లో రాకేష్‌రెడ్డికి వచ్చిన ఓట్లను బీఆర్‌ఎస్ ఇప్పుడు కీలకంగా పరిగణిస్తోంది. ఎన్నికల ఫలితాల్లో ఆయన రెండో స్థానానికి పరిమితమైనప్పటికీ, రాకేష్‌రెడ్డికి నిరు ద్యోగులు, పట్టభద్రుల్లో ఉన్న గుర్తిం పు, పార్టీ శ్రేణులతో ఉన్న అనుసంధా నం ఈసారి ఉపయోగపడుతుందని బీఆర్‌ఎస్ వర్గాలు భావిస్తు న్నాయి. గత ఎన్నికల తర్వాత కూడా నిరుద్యోగులు, విద్యార్థులు, పట్టభద్రుల సమ స్య లు, ఉద్యోగ ని యామకాలు తదితర అంశాలపై ఆయన కొనసాగించిన కార్యక్రమాలు ఎన్నికల్లో కలిసొచ్చే అవకాశాలు ఉన్నాయి.
పట్టభద్రుల తీర్పునకు ప్రాధాన్యం
రెండు ఎమ్మెల్సీ ఎన్నికలు కేవలం రాజకీయ పోటీగా మాత్రమే కాకుండా.. పట్టభ ద్రులు, యువతలో ఆయా పార్టీలకు ఉన్న ప్రస్తుత ఆదరణను అంచనా వేసే పరీక్షగా మారుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల తర్వాత పార్టీ ఎదుర్కొన్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో గ్రాడ్యుయేట్ ఓటర్ల తీర్పుకు ప్రాధాన్యత పెరిగింది. ఈ నేపథ్యంలో ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న యువత, గత కొంతకాలంగా ప్రభుత్వ నియామకాలు, పరీక్షలు, విద్యా సమస్యలపై అసంతృప్తితో ఉన్న వర్గాలను తనవైపు తిప్పుకునేందుకు బీఆర్‌ఎస్ పార్టీ ప్రయత్నిస్తుంది.
అయితే ఎన్నికల్లో వ్యక్తిగత ఇమేజ్‌తో పాటు పార్టీ సంస్థాగత బలం, ఓటర్ల నమోదు, సామాజిక సమీకరణాలు, ఇతర పార్టీల అభ్యర్థులు, స్వతంత్రుల ప్రభావం కూడా కీలకంగా ఉండనుంది. ఇటీవల నిర్వహించిన ఒక సర్వేలో గ్రాడ్యుయేట్ ఓటర్లలో అభ్యర్థి ఎంపికకు ప్రాధాన్యత ఉం దని వెల్లడైనట్టు తెలుస్తోంది. దీనికితోడు ఇ ప్పటికే కాంగ్రెస్ రెండు స్థానాలకు అభ్యర్థుల ను ప్రకటించింది. మహబూబ్‌నగర్ స్థానానికి సామ రామ్మోహన్‌రెడ్డి, వరంగల్‌కు రాంరెడ్డి సర్వోత్తమ్‌రెడ్డిని ప్రకటించింది.
దీంతో బీఆర్‌ఎస్‌పై కూడా అభ్యర్థుల ఎంపికను త్వరగా పూర్తి చేయాలనే ఒత్తిడి పెరిగిం ది. జనసేన ఇప్పటికే గడల శ్రీనివాసరావును అభ్యర్థిగా ప్రకటించింది. బీజేపీ అభ్యర్థిపై ఇం కా స్పష్టత రావాల్సి ఉంది. దీంతో బీఆర్‌ఎస్ వ్యూహాత్మకంగా రాకేష్‌రెడ్డినే మరోసారి అ భ్యర్థిగా నిలిపి మరో ఎమ్మెల్సీ స్థానాన్ని త మ ఖాతాలో వేసుకోవాలని వ్యూహ రచన చేస్తోంది. ఒకవైపు సిట్టింగ్ మహబూబ్‌నగర్- స్థానాన్ని కాపా డుకోవడం, మరోవైపు 2024లో కోల్పోయి న వరంగల్- స్థానాన్ని తి రిగి సాధించడం ద్వారా పార్టీకి రాజకీయంగా బలం చేకూర్చుకోవాలని బీఆర్‌ఎస్ చూస్తోంది. ముఖ్యంగా రాకేష్‌రెడ్డిని మరోసారి రంగంలోకి దించితే గత ఎన్నికల అను భవాన్ని ఈసారి మరింత విస్తృత ప్రచారానికి ఉపయోగించుకునే అవకాశం ఉంటుం దని భావిస్తోంది.
మహబూబ్‌నగర్ అభ్యర్థి ఎంపికపై ఆసక్తి
మహబూబ్‌నగర్ సీటుకు అభ్యర్థి ఎంపికపై ఆసక్తి నెలకొంది. సామాజిక సమీకరణాలు, పరిచయాలు, పార్టీకి సంస్థాగత బలం, యువత తో అనుసంధానం, ఉద్యోగ సమస్యలపై మాట్లాడగల సామర్థ్యం వంటి అంశాలు అభ్యర్థి ఎంపికలో కీలకంగా మారే అవకాశం ఉంది. సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకోవాలంటే గత ఎన్నికల విజయానికి దారితీ సిన పార్టీ సమన్వయాన్ని తిరిగి సాధించాల్సిన అవసరం ఉందని బీఆర్‌ఎస్ ఇప్పటికే తమ నేతలకు స్పష్టం చేసింది.