ఘనంగా గాంధీ జయంతి వేడుకలు
వెంకటాపురం, నూగూరు అక్టోబర్ 2 విజయ క్రాంతి : వెంకటాపురం మండలం కాంగ్రెస్ పార్టీ( Congress Party) మండల అధ్యక్షుడు సయ్యద్ హుస్సేన్ ఆధ్వర్యంలో దేశ స్వాతంత్య్రం కోసం గాంధీజీ చేసిన త్యాగాలను స్మరించుకుంటూ గాంధీ జయంతి వేడుకలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు దేశ స్వాతంత్య్రం కోసం గాంధీజీ చేసిన త్యాగాలను స్మరించుకుంటూ ఈ సందర్భంగా నాయకులు మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
గాంధీజీ చూపిన సత్యం, అహింస, స్వచ్ఛత, గ్రామ స్వరాజ్యం వంటి ఆశయాలను ప్రతి ఒక్కరూ ఆచరించాలని నాయకులు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ యూత్ అధ్యక్షుడు చిట్టెం సాయి, మద్దుకూరి ప్రసాద్, బాలసాని మధు, తిప్పని సమ్మయ్య, గాంధారుల నాగేశ్వరరావు, డర్ర రవి, రమేష్ బాబు తదితరులు పాల్గొన్నారు