గాంధీ జయంతి వేడుకల్లో ఎమ్మెల్యే

02-10-2026 | 02:57pm

సత్యం, అహింస మార్గాలను ఆదర్శంగా తీసుకోవాలి: ఎమ్మెల్యే.

ఆలేరు, అక్టోబర్ 2 (విజయక్రాంతి): గాంధీ జయంతి సందర్భంగా భువనగిరి పట్టణంలోని గాంధీ పార్క్ వద్ద నిర్వహించిన వేడుకల్లో భువనగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి(Bhongir MLA Kumbham Anil Kumar Reddy) పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. దేశ స్వాతంత్ర్య ఉద్యమంలో మహాత్మా గాంధీ పోషించిన కీలక పాత్రను, దేశానికి ఆయన అందించిన సేవలను ఎమ్మెల్యే స్మరించుకున్నారు.

గాంధీజీ చూపిన సత్యం, అహింస మార్గాలను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ వెంకారెడ్డి, మున్సిపల్ చైర్‌పర్సన్ తంగళ్లపల్లి శ్రీవాణి-రవికుమార్, గ్రంథాలయ చైర్మన్ అవేస్ చిస్తి, ఆర్డీఓ కృష్ణారెడ్డి, మున్సిపల్ కమిషనర్ చంద్రశేఖర్ రెడ్డి, మున్సిపల్ వైస్ చైర్‌పర్సన్ పోతంశెట్టి మంజుల-వెంకటేశ్వర్లు, ఆత్మ చైర్మన్ ఎలిమినేటి కృష్ణారెడ్డి, భువనగిరి PACS చైర్మన్ కొండల్ రెడ్డి, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు కూర వెంకటేష్, సీనియర్ కాంగ్రెస్ నాయకులు, కౌన్సిలర్లు, కో-ఆప్షన్ సభ్యులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు