ప్రజలు లేని సమావేశాలు ఎందుకు
బోథ్. అక్టోబర్ 2 (విజయ క్రాంతి). మండల కేంద్రంలో గాంధీ జయంతి(Gandhi Jayanti) అక్టోబర్ రెండున జరిగిన గ్రామసభ(Gram Sabha) గందరగోళానికి దారి తీసింది. గ్రామ సర్పంచ్ కురుమే అన్నపూర్ణ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఎంపీడీవో ఎల్ రమేష్ తో పాటు ఏపీ ఓ జగదే రావు తోపాటు వార్డు సభ్యులు పలువురు నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మార్కెట్ కమిటీ చైర్మన్ మల్లెపూల సత్యనారాయణ తో పాటు కౌసర్ తదితరులు సమావేశంలో అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తపరిచారు.
సమావేశంలో ప్రజలు ఎవరూ లేరని అంతా నాయకులు ఉన్నారని ప్రజలను సమావేశానికి ఎందుకు పిలువ లేదంటూ నిలదీశారు. సమస్యలు సమస్యలుగానే మిగిలిపోతున్నాయని కేవలం స్వార్థం కోసం చేస్తున్న పనులే ఉన్నాయని వారు ఆ గ్రామ వ్యక్తపరిచారు.
సమావేశంలో అధికారులు సరిది చెప్పి ప్రశాంతంగా జరిగే విధంగా చూశారు. మండలంలోని అన్ని గ్రామాలలో గ్రామసభలను నిర్వహించడం జరిగింది. ఆయా గ్రామాలలో సర్పంచ్లతో పాటు వార్డు సభ్యులు కార్యదర్శులు పాల్గొన్నారు.