పేద ప్రజలకు ఆసరా అందించడమే లక్ష్యం
12-11-2026 | 05:53pm
బోథ్. నవంబర్ 12 (విజయ క్రాంతి): పేద ప్రజలకు అండగా ఉండాలని ఆసరా పెన్షన్లు( Aasara Pensions) అందిస్తున్నారని ఎమ్మెల్యే జాదవ్ అనిల్(MLA Jadhav Anil) పేర్కొన్నారు. మండల కేంద్రంలోని రైతు వేదికలో నిర్వహించిన కార్యక్రమంలో మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన 552 ఆసరా పెన్షన్ కార్డుల ప్రొసీడింగ్లను అందించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెన్షన్ల ద్వారా దివ్యాంగులు వితంతువులు ఆర్థిక భరోసా పొందుతారు అన్నారు. అర్హులైనప్రతి ఒక్కరికి ప్రభుత్వ పదాలు అందే విధంగా కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధి స్థానిక నాయకులు పాల్గొన్నారు.