హస్తం వదిలి.. కారు ఎక్కిన భార్గవ్!
ఆదిలాబాద్, అక్టోబర్ 25, (విజయక్రాంతి) : జిల్లాలో కాంగ్రెస్(Congress)కు మరో ఎదురు దెబ్బ తగిలింది. ఆ పార్టీ సీనియర్ నాయకులు, ఎన్.ఎస్.యు.ఐ రాష్ట్ర మాజీ అధ్యక్షులు, డీసీసీ మాజీ చైర్మన్ భార్గవ్ దేశ్పాండే(Former DCC Chairman Bhargav Deshpande) కాంగ్రెస్ పార్టీకి హ్యాండ్ ఇచ్చి కార్ ఎక్కారు. ఆదివారం హైదారాబాద్ లో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా బీఆర్ఎస్ నేతలతో కలిసి
బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. భార్గవ్ కు కేటీఆర్ గులాబీ కండువాను కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. నవంబర్ 1వ తేదీన ఆదిలాబాద్ లో నిర్వహించే భారీ బహిరంగ సభలో పెద్ద ఎత్తున భార్గవ్ తన అనుచరులను పార్టీలో చేర్పించనున్నారు.
ఈ కార్యక్రమంలో మాజీ మంత్రులు జోగు రామన్న, ప్రశాంత్ రెడ్డి,ఎమ్మెల్యేలు అనిల్ జాదవ్, కోవ లక్ష్మీ, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్, జాన్సన్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.