బ్యాంకింగ్ పథకాలపై అవగాహన సదస్సు
03-11-2026 | 05:11pm
తలమడుగు నవంబర్ 3(విజయక్రాంతి): తాంసి మండలం గొట్కూర్లో బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర(Bank of Maharashtra) తలమడుగు శాఖ(Talamadugu Branch) ఆధ్వర్యంలో బ్యాంకింగ్ పథకాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. మేనేజర్ వెంకట సాయి కిరణ్ మాట్లాడుతూ.. జనధన్, జీవిత బీమా, సురక్ష బీమా, సుకన్య సమృద్ధి, అటల్ పెన్షన్ యోజన పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
రైతులు ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్యలకు పాల్పడవద్దని, సమస్యలుంటే బ్యాంకులను సంప్రదించాలని కోరారు. కార్యక్రమంలో కాడే స్వామి, సర్పంచ్ మతీన్, కార్యదర్శి సత్యనారాయణ పాల్గొన్నారు.