ఎల్ నినో ప్రభావం
జిల్లా వ్యవసాయ అధికారి దేవ్ కుమార్
చేగుంట నవంబర్ 12,విజయక్రాంతి: ఎల్ నినో ప్రభావం(El Niño effect) కారణంగా వర్షపాతం తగ్గే అవకాశం ఉండటం, భూగర్భ జలమట్టాలు పడిపోవడం, సాగునీటి వనరుల్లో నీటి లభ్యత తగ్గుతున్న నేపథ్యంలో రైతులు ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా పంటల సాగు ప్రణాళికను రూపొందించుకోవాలని చేగుంట మండలం లోని అనంతసాగర్ గ్రామసభ లో జిల్లా వ్యవసాయధికారి దేవుకుమార్ సూచించారు.
నీటి లభ్యత తక్కువగా ఉన్న ప్రాంతాల్లో వరి సాగుకు బదులుగా తక్కువ నీటితో పండించే ఆరుతడి పంటలైన జొన్న, మొక్కజొన్న, సజ్జ, కంది, పెసర, మినుము, శనగ వంటి పంటలను సాగు చేయడానికి ప్రాధాన్యత ఇవ్వాలి అన్నారు. ఈ కార్యక్రమం లో గ్రామ సర్పంచ్ వి . శ్రీధర్, ఉప సర్పంచ్ స్వామి, వార్డు మెంబెర్స్, తాసిల్దార్ బాల్ లక్మి , ఎంపీడీఓ చిన్న రెడ్డి,,హరిప్రసాద్ , ఇరిగేషన్ ఎ ఈ , ఎలక్ట్రిసిటీ ఎఈ , హోసింగ్ ఎ ఈ , ఏపీ ఓ , ఏఈవో రైతులు పాలుగోన్నారు.