బ్రెస్ట్ క్యాన్సర్‌పై ప్రత్యేక అవగాహన
రెనోవా సెంచరీ హాస్పిటల్స్‌లో కార్యక్రమ నిర్వహణ
హైదరాబాద్(బంజారాహిల్స్), అక్టోబర్ 19(విజయక్రాంతి): బ్రెస్ట్ క్యాన్సర్‌పై(Breast cancer) ‘పింక్ అక్టోబర్(Pink October)’ అవగాహన మాసాన్ని పురస్కరించుకుని బం జారాహిల్స్ రోడ్ నంబర్ 12లోని రెనోవా సెంచరీ హాస్పిటల్స్(Renova Century Hospitals) ఆవరణలో సోమవారం ‘ప్రతి కథ ప్రత్యే కం.. ప్రతి ప్రయాణం విలువైనదే’ అనే సదేశంతో ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా రెనోవా సెంచరీ హాస్పిటల్స్‌లో(Renova Century Hospitals) చికిత్స పొంది రొమ్ము క్యాన్సర్‌ను జయించిన ఆశా సురేష్‌ను(Asha Suresh) ఆసుపత్రి యాజమాన్యం, వైద్య బృందం సన్మానించారు.
క్యాన్సర్ నిర్ధారణ అయినప్పటి నుంచి సరైన చికిత్స, పట్టుదలతో వ్యాధిపై పోరాడి గెలిచిన ఆమె ధైర్యం ఇతరులకు స్ఫూర్తిదాయకమని ఈ సందర్భంగా కొనియాడారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజ రైన రెనోవా గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ వ్యవస్థాపకులు, సీఈఓ శ్రీధర్ పెద్దిరెడ్డి మాట్లాడుతూ బ్రెస్ట్ క్యాన్సర్‌పై అవగాహన, సకాలంలో పరీక్షలు, సరైన వైద్య సలహాలు మహిళల ఆరోగ్య పరిరక్షణలో కీలక పాత్ర పోషిస్తాయని అన్నారు. క్యాన్సర్ చికిత్సను సామాన్యులకు అందుబాటు ధరల్లో అందించడమే రెనోవా ఆంకాలజీ ప్రధాన లక్ష్యమని తెలిపారు.
కార్యక్రమంలో రెనోవా సెంచరీ హాస్పిటల్స్ హెడ్ అండ్ నెక్ ఆంకాలజీ విభాగ అధిపతి డాక్టర్ క్రాంతి కుమార్ గంగిటి, మెడికల్ అండ్ హెమటోఆంకాలజిస్ట్ డాక్టర్ జ్యోత్స్న ఎలగందుల సీనియర్ కన్సల్టెంట్ మెడికల్ అండ్ హెమటో ఆంకాలజిస్ట్ డాక్టర్ రాజేష్ బొల్లం, కన్సల్టెంట్ మెడికల్ అండ్ హెమ టో ఆంకాలజిస్ట్, బోన్ మ్యారో ట్రాన్స్‌ప్లాంట్ ఫిజిషియన్ డాక్టర్ వాసు బాబు, కన్సల్టెంట్ సర్జికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ పి. కౌశిక్ రావు, సీనియర్ కన్సల్టెంట్ రేడియేషన్ ఆంకాలజిస్ట్ డాక్టర్ ప్రపుల్ కుమార్, కన్సల్టెంట్ రేడియేషన్ ఆంకాలజిస్ట్ డాక్టర్ రామ వాఘ్మారే, కన్సల్టెంట్ మెడికల్ అండ్ హెమటో ఆంకాలజిస్ట్ డాక్టర్ ఎం.ఏ. సుబూర్ షహెరోస్, సీఓఓ రవీంద్రనాథ్ గరగ, సెంటర్ హెడ్ డాక్టర్ వారిస్, వైస్ ప్రెసిడెంట్ మెడికల్ సర్వీసెస్ డాక్టర్ షరీఫ్ పాల్గొన్నారు.