ముదిరాజులను బీసీ-‘ఏ’లోకి మార్చాలి

20-10-2026 | 05:00am

టి-మ్యాప్స్ రాష్ట్ర కన్వీనర్ పిట్టల భూమేష్ ముదిరాజ్ ఆమరణ నిరాహార దీక్ష

ముషీరాబాద్, అక్టోబర్ 19 (విజయక్రాంతి): ముదిరాజులను(Mudirajs) బీసీ-డి గ్రూపు నుంచి బీసీ-ఏ గ్రూపులోకి(BC-A Group) మార్చాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ ముదిరాజుల ఆత్మగౌరవ పోరాట సంఘం(Telangana Mudiraj Self-Respect Struggle Association) (టి-మ్యాప్స్) రాష్ట్ర కన్వీనర్ పిట్టల భూమేష్ ముదిరాజ్, డ్యాగల రమ ముదిరాజ్ ఆమరణ నిరాహార దీక్ష(Indefinite hunger strike) ప్రారంభించారు. ఈ మేరకు సోమవారం మచ్చ బొల్లారం కార్యాలయంలో మధ్యాహ్నం 3 గంటలకు దీక్ష చేపట్టారు. కామారెడ్డి డిక్లరేషన్(Kamareddy Declaration) ప్రకారం ముదిరాజులకు బీసీ-ఏ గ్రూ పులో రిజర్వేషన్లు కల్పించాలని వారు డి మాండ్ చేశారు.

అక్టోబర్ 22న తెనుగోళ్ల పండుగ సాయన్న జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రభుత్వం ఇందు కు సంబంధించిన జీవోను ప్రకటించాలని కోరారు. రిజర్వేషన్లకు చట్టబద్ధత కల్పిస్తూ తొమ్మిదో షెడ్యూ ల్లో చేర్చి అమలు చేయాలని డిమాండ్ చేశారు.ఈ దీక్షకు ముఖ్య అతిథిగా హాజరైన బీసీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు నాగనమోని చెన్నరాములు ముదిరాజ్ సంపూర్ణ మద్దతు ప్రకటించారు.

మరిన్ని వార్తలు