ధర్మ పరిరక్షణకు ప్రతీక ఆయుధ పూజ
హిందూ సమాజంలో ధైర్యం, ఐక్యత పెంపొందించాలి
వీహెచ్‌పీ రాష్ట్ర నేత బాలస్వామి
నారాయణ్‌పేట, అక్టోబర్ 19(విజయక్రాంతి): హిందూ ధర్మ సంప్రదాయంలో(Hindu Dharma Tradition) ఆయుధ పూజకు(Ayudha Puja) విశిష్టమైన స్థానం ఉందని విశ్వహిందూ పరిషత్(వీహెచ్‌పీ) తెలంగాణ రాష్ట్ర ధర్మాచార్య సంపర్క ప్రముఖ్ పగుడాకుల బాలస్వామి(Pagudakula Balaswamy) పేర్కొన్నారు. విజయదశమి(Vijayadashami) పర్వదినాన్ని పురస్కరించుకొని నారాయణపేట బజరంగ్దళ్(Narayanpet Bajrang Dal) ఆధ్వర్యంలో సోమవారం నారాయణపేట జిల్లా కేంద్రంలోని భవానిమాత మందిరంలో ఘనంగా ఆయుధ పూజ నిర్వహించారు.
ఈ సందర్భంగా బాలస్వామి మాట్లాడుతూ ఆయుధ పూజ అనేది ధర్మాన్ని పరిరక్షించడానికి, సమాజాన్ని రక్షించడానికి, అన్యాయాన్ని ఎదుర్కొనే ధైర్యాన్ని పెంపొందించుకోవడానికి ప్రతీక అని వివరించారు. విజయదశమి స్ఫూర్తితో ప్రతి హిందువు ధర్మాచరణకు కట్టుబడి, సమాజ ఐక్యతకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో వీహెచ్‌పీ నారాయణపేట జిల్లా కార్యదర్శి శివకుమార్, విశ్వహిందూ పరిషత్ నగరకార్యదర్శి ప్రవీణ్ కడదాస్ బజరంగ్దళ్ జిల్లా కన్వీనర్ శ్రవణ్ కుమార్, గిరీష్, రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.