ఏఐ పోలీసింగ్

20-10-2026 | 05:30am

అంతర్జాతీయ ప్రమాణాలతో ఫ్యూచర్ సిటీ భద్రత

కొత్త పోలీస్ కమిషనరేట్‌ను ప్రారంభించిన సీఎం రేవంత్‌రెడ్డి

ఎన్‌ఐయూఎం ప్రాంగణానికి శంకుస్థాపన.. రూ. 200 కోట్లతో నిర్మాణం

ఇబ్రహీంపట్నం /అబ్దుల్లాపూర్‌మెట్, అక్టోబర్ 19 (విజయక్రాంతి): రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీర్చిదిద్దుతున్న ‘భారత్ ఫ్యూచర్ సిటీ(India Future City)’ అభివృద్ధిలో సోమవారం రెండు కీలక ఘట్టాలు ఆవిష్కృతమయ్యాయి. రంగారెడ్డి జిల్లా(Ranga Reddy District) ఇబ్రహీంపట్నంలో నూతనంగా ఏర్పాటు చేసిన ‘ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనరేట్(Future City Police Commissionerate)’ను సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) లాంఛనంగా ప్రారంభించారు. ఏఐ సాంకేతికతో(AI technology) ఈ పోలీస్ కమిషనరేట్ పనిచేయనుంది. అదేవిధంగా, ఫ్యూచర్ సిటీ పరిధిలోనే రూ. 200 కోట్లతో చేపడుతున్న నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ అర్బన్ మేనేజ్‌మెంట్ (ఎన్‌ఐయూఎం) నూతన ప్రాంగణ నిర్మాణానికి కూడా ముఖ్యమంత్రి శంకుస్థాపన చేశారు.

పర్యావరణ అనుకూలమై ‘నెట్ జీరో’ డిజైన్‌తో ఇది రూపుదిద్దుకోనున్నది. ఈ సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ.. నాల్గో నగరంగా రూపుదిద్దుకుంటున్న ఫ్యూచర్ సిటీలో అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన భద్రత, సుస్థిర పట్టణాభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నదని స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవమైన 2028 జూన్ 2 నాటికి ఎన్‌ఐయూఎం ప్రాంగణ నిర్మాణాన్ని పూర్తి చేసి, ప్రారంభించుకుందామని అధికారులను ఆదేశించారు.

అంతకు ముందు సీఎం రేవంత్‌రెడ్డియంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ భవన నిర్మాణాలు, పరిసర ప్రాంతాలను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో ఎం పీలు వేం నరేందర్ రెడ్డి, మల్లు రవి, చామల కిరణ్ కుమార్ రెడ్డి, శాసనమండలి చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి, ఎమ్మెల్యేలు మల్‌రెడ్డి రంగారెడ్డి, వీర్లపల్లి శంకరయ్య, టి.ప్రకాశ్‌గౌడ్, డీజీపీ సీవీ ఆనంద్, ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనర్ డాక్టర్ తరుణ్ జోషీ పాల్గొన్నారు. 

వేగవంతంగా పోలీస్ సేవలు

శాంతిభద్రతల పరిరక్షణ, నేరా ల నియంత్రణ, వేగవంతమైన పో లీసు సేవలు అందించడమే లక్ష్యంగా ఫ్యూచర్ సిటీ కమిషనరేట్ అందుబాటులోకి తెచ్చారు. ఆధునిక పోలీసిం గ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సైబర్ నేరాల దర్యాప్తు, డిజిటల్ ఆధారాల విశ్లేషణ, పర్మిటివ్ పోలీసింగ్, మహిళల భద్రతకు ప్రత్యే క ప్రాధాన్యం ఇస్తున్నారు. ఇప్పటికే 210 మంది కి పైగా సిబ్బంది ఏఐ ఛాంపియన్స్ శిక్షణ పూర్తి చేసుకున్నారు. శంషాబాద్ ఎయిర్‌పోర్ట్  పరిసరాలు, ఓఆర్‌ఆర్ వెలుపలి పారిశ్రామికవాడలు, ఏఐ సిటీ, స్కిల్ యూనివర్సిటీ, మెడి కల్ సిటీ వంటి విభాగాలు ఈ కమిషనరేట్ పరిధిలోకి వ స్తాయి. ప్రాంత విస్తరణకు తగ్గట్టు నూతన జోన్లు, డివిజన్లు, మహిళా, ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లను ఏర్పాటు చేయనున్నారు.

16 ఏండ్ల నాటి జాతీయ హామీ సాకారం

పట్టణ నిర్వహణ, కార్యాచరణ ఆధారిత పరిశోధన రంగాల్లో జాతీయ స్థాయి అత్యుత్తమ కేంద్రంగా నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ అర్బన్ మేనేజ్‌మెంట్ (ఎన్‌ఐయూఎం) ఆవిర్భవించనుంది. 2009లో నెహ్రూ జాతీయ పట్టణ పునరుద్ధరణ మిషన్ కింద ఎంపికైన ఈ ప్రాజెక్టుకు.. ప్రస్తుత ప్రభుత్వం 20 ఎకరాల ఉచిత భూమి ని కేటాయించడంతో 16 ఏండ్ల నాటి హామీ నెరవేరింది. రూ.200 కోట్లతో వ్యయంతో చేపట్టనున్న ఈ ప్రాంగణ నిర్మా ణం తెలంగా ణ ఆవిర్భావ దినోత్సవమైన 2028 జూన్ 2 నాటికి పూర్తి చేసి, ప్రారంభించుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. 

గ్లోబల్ సమ్మిట్  పనులు వేగవంతం చేయండి

భారత్ ఫ్యూచర్ సిటీ వేదికగా డిసెంబర్ 7 నుంచి 9 వరకు నిర్వహించనున్న ‘ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ -2026’ ఏర్పాట్లను అంతర్జాతీయ స్థాయిలో చేపట్టాలని, పనులను వేగవంతం చేయాలని అధికారులను సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించారు. ‘మీ పెట్టుబడు లకు మాది భరోసా’ అనే నినాదంతో యంగ్ ఇండి యా స్కిల్స్ యూనివర్సిటీ ప్రాంగణంలో ఈ సదస్సు జరగనుందని తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న పారిశ్రామికవేత్తలను ఆకట్టుకునేలా ఏర్పాట్లు ఉండాలని, నవంబర్ నెలాఖరు నాటికి పనులన్నీ పూర్తి కావాలని ఆయన స్పష్టం చేశారు.

నిర్దేశిత గడువు కంటే 15 రోజుల ముందే బహిరంగ ప్రాంగణ పనులను నవంబర్ 15లోగా పూర్తి చేయాలని ఆదేశించారు. పనుల పర్యవేక్షణకు అధికారులతో ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయాలన్నారు. ‘ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్’ ఒక వ్యాపార సదస్సు మాత్రమే కాదని.. రాష్ట్రీయ రాజకీయ, ఆర్థిక ముఖచిత్రాన్ని మార్చే చారిత్రక వేదిక కానుందని సీఎం పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు