జీహెచ్‌ఎంసీ శాశ్వత ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి

20-10-2026 | 05:10am

కవాడిగూడ పార్కింగ్ యార్డులో ఘనంగా దసరా ఉత్సవాలు

తెలంగాణ జన సమితి గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడు ఎం.నరసయ్య 

ముషీరాబాద్, అక్టోబర్ 19 (విజయక్రాంతి): జీహెచ్‌ఎంసీలో పనిచేస్తున్న శాశ్వత ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామని  తెలంగాణ జన సమితి గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడు ఎం. నరసయ్య తెలిపారు. సోమవారం కవాడిగూడ జీహెచ్‌ఎంసీ పార్కింగ్ యార్డులో నిర్వహించిన దసరా ఉత్సవాలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా నరసయ్య మాట్లాడుతూ జీహెచ్‌ఎంసీలోని వివిధ విభాగాల్లో పనిచేస్తున్న శాశ్వత ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని పేర్కొన్నారు.

జీహెచ్‌ఎంసీ ట్రాన్స్పోర్ట్ విభాగం అసోసియేషన్ అధ్యక్షుడు మహమ్మద్ జహీర్ మాట్లాడుతూ  ట్రాన్స్పోర్ట్ విభాగంతో పాటు కాంట్రాక్టు పద్ధతిలో పనిచేస్తున్న ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ప్రొఫెసర్ కోదండరామ్ నాయకత్వంలో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో కవాడిగూడ పార్కింగ్ యార్డు అసోసియేషన్ అధ్యక్షుడు మాధవరెడ్డి, టీపీటీ అధ్యక్షుడు ఉప్పర వెంకటేష్, అసోసియేషన్ నాయకులు ప్రసాద్, రవి, రఫీ, పాండు నాయక్, శాశ్వత ఉద్యోగుల అసోసియేషన్ నాయకుడు పోచన్న, తెలంగాణ జన సమితి నగర ఉపాధ్యక్షుడు జైపాల్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు