తెలుగువారి ప్రేమలు విలువైనవి

20-10-2026 | 05:50am

రామాయణ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో హీరో రణ్‌బీర్ కపూర్

రణ్‌బీర్ కపూర్(Ranbir Kapoor), రాకింగ్ స్టార్ యశ్, సాయిపల్లవి(Sai Pallavi) ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ‘రామాయణం(Ramayana)’. నితేశ్ తివారీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని ప్రైమ్ ఫోకస్ స్టూడియోస్, డీఎన్‌ఈజీ, మాన్‌స్టర్ మైండ్ క్రియేషన్స్ నిర్మిస్తున్నాయి. రెండు భాగాలుగా రూపుదిద్దుకున్న ఈ చిత్రం తొలి భాగం నవంబర్ 5న హిందీ, తెలుగు(Telugu), కన్నడ, తమిళం, మలయాళ భాషల్లో విడుదల కానుంది. తెలంగాణ, ఏపీలో ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ సంస్థ ఎస్వీసీ ద్వారా రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా మేకర్స్ సోమవారం హైదరాబాద్‌లో తెలుగు ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ను(Telugu Pre-release Event) నిర్వహించారు.

ఈ వేడుకలో రణ్‌బీర్ కపూర్ మాట్లాడుతూ.. “కొన్ని కథలు చెప్పాల్సిన అవసరం లేదు. అవి మనతో పాటు నిలిచిపోతాయి. రామాయణం కూడా అలాంటిదే. థియేటర్‌లో చూస్తున్నప్పుడు ఇదొక సినిమా చూసినట్టుగా ఉండదు. కచ్చితంగా ఏదో ఒక అద్భుతమైన అనుభూతిని పొందినట్టు ఉంటుంది. మనందరిలో మంచిని పంచే సినిమా ఇది. రకుల్ పెర్ఫార్మెన్స్ అందరినీ సర్‌ప్రైజ్ చేస్తుంది. షూటింగ్ సెట్లో సాయిపల్లవిని చూసినప్పుడు నిజంగా సీతమ్మవారిని చూసినట్టుగా అనిపించింది.

తను తప్పితే ఈ క్యారెక్టర్‌లో మరొకరిని ఊహించుకోలేకపోతున్నా. రాకింగ్ స్టార్ యశ్ మంచి ఫ్యామిలీ మెన్. ఆయనలాంటి హార్డ్ వర్కర్‌ను నేనెప్పుడూ చూడలేదు. దిల్ రాజు వివిధ భాషల్లో వచ్చే సినిమాలకు ఎంతో అండగా ఉంటారు. భవిష్యత్తులో ఆయనతో కలిసి మరి న్ని ప్రాజెక్టులు చేయాలని కోరుకుంటున్నా. తెలుగు ప్రేక్షకులు నన్ను యాక్సెప్ట్ చేసినందుకు ధన్యవాదాలు. హైదరాబాద్‌కు రావడం నాకెప్పుడూ ప్రత్యేకమే. మీ ప్రేమ, అభిమానం నాకు చాలా విలువైనవి” అన్నారు.

సాయిపల్లవి మాట్లాడుతూ.. “ఈ సినిమా మీకు ఒక ప్రాపర్ తెలుగు సినిమాలాగే అనిపిస్తుంది. నితీశ్ ప్రతి విషయాన్ని ఎంతో శ్రద్ధగా, క్లారిటీగా డిజైన్ చేశారు. నమిత్ విజన్ చాలా గొప్పది. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులకు చేరాలనే గొప్ప ఉద్దేశంతో రూపొందించారు. నేను కూడా రామాయణం చూసి పెరిగాను. ఈ సినిమాలో బెస్ట్ విజువల్ ఎఫెక్ట్స్ ఉంటాయి. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు అందరూ కనెక్ట్ అవుతారు. దిల్ రాజుతో ‘ఫిదా’ సినిమా నుంచి జర్నీ ఉంది. ఆయన ఈ సినిమాను తెలుగులో రిలీజ్ చేయడం చాలా ఆనందంగా ఉంది.

రణ్‌బీర్ కపూర్ లాంటి గొప్ప యాక్టర్‌ను నేనెప్పుడూ చూడలేదు. యశ్ సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లాలనే ఉద్దే శం ఉన్న యాక్టర్. సీతమ్మ పాత్రను చూసినప్పుడు ప్రతి ఒక్కరిలోనూ ఒక దివ్యత్వం కలగాలి. అదే నా కోరిక. తెలుగు ప్రేక్షకులు ఇచ్చే ప్రేమకు నేను ఎప్పటికీ రుణపడి ఉంటా” అని చెప్పారు. యశ్ మాట్లాడుతూ.. “ప్రేక్షకుల ప్రేమే మమ్మల్ని ముం దుకు నడిపిస్తుంది. ప్రేక్షకులకు వినోదం పంచేందుకే మేము పనిచేస్తున్నాం. రాజమౌళి, ప్రభాస్, రామ్‌చరణ్, ఎన్టీఆర్.. ఇలా అందరూ మన ఇండస్ట్రీ ఎలాంటి అద్భుతాలు చేయగలదో చూపించారు.

ఒక మంచి సినిమా తీయా లంటే మంచి ప్యాషన్ ఉన్న ప్రొడ్యూసర్ కావాలి. అలాంటి ప్యాషన్ ఉన్న వ్యక్తి దిల్ రాజు. ఆయన డిస్ట్రిబ్యూషన్ చేసినప్పుడు కూడా ఎంతో కేర్ తీసుకుంటారు. ‘రామాయణ’ గురించి చెప్పినప్పుడు నేను రావణుడి పాత్ర చేస్తానని, ఈ సినిమాను నిర్మిస్తానని చెప్పా. ప్రతి ప్రేక్షకుడు, అభిమానులు సినిమాపై ప్రేమ చూపించాలని కోరుకుంటున్నా” అన్నారు. డైరెక్టర్ నితేశ్ తివారీ మాట్లాడుతూ.. “నేను దాదాపుగా అన్ని తెలుగు సినిమాలు చూస్తా. ‘గీతాంజలి’, ‘క్షణక్షణం’ సినిమాలన్నీ తెలుగులోనే చూశా.

‘ఈగ’, ‘మగధీర’, ‘బాహుబలి’ ఇలా అన్ని సినిమాలను హిందీలో చూశా. నాకు రాజమౌళి, సుకుమార్, త్రివిక్రమ్, సందీప్‌రెడ్డి వంగా, నాగ్ అశ్విన్.. ఇలా అందరి సినిమాలంటే ఇష్టం. ఇప్పు డు మా ‘రామాయణ’ సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వస్తున్నాం. మీరు తెలుగులో చూసినా, హిందీలో చూసినా అదే ప్రేమను అందిస్తారని కోరుకుంటున్నా” అని తెలిపారు. నిర్మాత నమిత్ మల్హోత్రా మాట్లాడుతూ.. “రామాయణం అంటేనే ఒక యూనివర్స్. ప్రతి భారతీయుడు గర్వపడే సినిమా ఇది.

ఈరోజు భారతీయ సినిమా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందుతోంది. మన కథను ప్రపంచానికి తీసుకెళ్తున్నాం. మీ అందరి ప్రేమ, అభిమానాలు మాకు కావాలి” అని చెప్పారు. నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ.. “రామాయణం లేకుండా మన దేశ చరిత్ర లేదు. రాముడి కథను ప్రపంచవ్యాప్తంగా తీసుకెళ్తున్న యూనిట్‌లోని ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. హాలీవుడ్‌లో సోనీ సంస్థ ఈ సినిమాను రిలీజ్ చేస్తోంది.

నార్త్‌లో కరణ్ జోహార్, తెలుగు రాష్ట్రాల్లో మా సంస్థ ద్వారా రిలీజ్ అవుతోంది. రేపటి నుంచి అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ అవుతున్నాయి. నవంబర్ 5న ఒక వండర్ క్రియేట్ కావాలి. తెలుగు రాష్ట్రాలతోపాటు ప్రపంచవ్యాప్తంగా ఒక అద్భుతం జరగాలి” అన్నారు. రవి దూబే, రకుల్ ప్రీత్ సింగ్, కరణ్ జోహార్ కూడా ఈ వేడుకలో మాట్లాడారు. 

మరిన్ని వార్తలు