మాలా వచ్చా చూడు..
విక్టరీ వెంకటేశ్(Victory Venkatesh), త్రివిక్రమ్ శ్రీనివాస్(Trivikram Srinivas) కలయికలో వస్తు న్న చిత్రం ‘ఆదర్శ కుటుంబం హౌస్ నెంబర్(Ideal Family House Number) 47’ (ఏకే 47). హారికా అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై ఎస్ రాధాకృష్ణ నిర్మిస్తున్నారు. శ్రీనిధి శెట్టి(Srinidhi Shetty), నారా రోహిత్, నివేదా పేతురాజ్, యువినా, రాజ్ ప్రజ్వల్, రావు రమేశ్, సత్య, బ్రహ్మాజీ, ఉదయ్‌బీర్ సంధు, వెన్నెల కిశోర్, రఘుబాబు ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి రెండో గీతం ‘మాలా(Mala)’ విడుదలైంది.
‘అరేబియా అత్తరు సెంటు గమ్మత్తుగా ఘమ్ఘమ్ అంటూ.. నీ నుంచి నాదాకా ఫ్లుఓవరేస్తాందే.., నీ వొంట్లో ఉంది కరెంటు.. వెలిగించవే నా ఫిలమెంటు.., నీ శారీ చెయ్జారి పైపైకి వస్తాందే.., ఏ కష్టం నీకొద్దె పిల్లా.. ఎదురింట్లో నేనుండగా.., సింగిల్‌గా ఎన్నాళ్లిలా.. సిటికేస్తే వస్తాగా.., మాలా వచ్చా చూడు.. చాలా తెచ్చా పాలు.. నలగాలి పూలూవొళ్లూ.. అరవాలి మంచంకోళ్లు..’ అంటూ సాగుతోందీ గీతం.
రామజోగయ్య శాస్త్రి రాసిన ఈ పాటను తమన్ స్వరపర్చడమే కాక ధనుంజయ్ సీపాన, రణినా రెడ్డితో కలిసి పాడారు. భాను మాస్టర్ నృత్య రీతులను రూపొందించిన ఈ పాటలో వెంకటేశ్, నివేదా పేతురాజ్ మధ్య కెమిస్ట్రీ, హుషారైన స్టెప్పు లు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ చిత్రానికి రవి కే చంద్రన్ ఛాయాగ్రహణం అందిస్తుండగా, నవీన్ నూలి ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఏఎస్ ప్రకాశ్ కళా దర్శకత్వం వహిస్తున్నారు. తమన్ సంగీతా న్ని, కెవిన్ కుమార్ ఫైట్స్‌ను రూపొందిస్తున్నారు.