సమైఖ్య భవనాలతో మహిళల అభివృద్ధి

02-10-2026 | 01:50pm

మఠంపల్లి అక్టోబర్ 02(విజయ క్రాంతి): మహిళా సమైఖ్య భవనాలతో మహిళల అభివృద్ధి సాధ్యపడుతుందని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కాల్వపల్లి తండా సర్పంచ్ మాలోతు సక్రు నాయక్ అన్నారు.గ్రామంలో శ్రీ శక్తి మహిళా సమాఖ్య భవన(Sri Shakti Mahila Samakhya building) నిర్మాణానికి శుక్రవారం అధికారులు నాయకులతో కలిసి శంకు స్థాపన చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ రానున్న రోజుల్లో రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సహకారంతో గ్రామ పంచాయతీ అభివృద్ధికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

అలాగే మహిళల ప్రయోజనాల దృష్ట్యా 10 లక్షల రూపాయలతో భావన నిర్మాణ పనులు చేపట్టడం జరుగుతుందని,గ్రామంలోని మహిళలందరూ ఒకే చోట సమా వేశాలు అభివృద్ధి పనులు చేసు కోవడానికి ఈ భవనం ఎంతగానో ఉపయోగపడుతుందని అన్నారు.ఈ కార్యక్రమంలో కార్యదర్శి సీతారాములు, ఉపసర్పంచ్ బాబా వార్డు సభ్యులు రమేష్,చంటి సావిత్రి లచ్చిరాం,చందా,గ్రామ శాఖ అధ్యక్షులు వెంకటేశ్వర్లు,బ్రహ్మ చారి,హనుమా సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు