'సర్' రద్దు చేయాలి

10-10-2026 | 08:22pm

సీఈసీ వెంటనే రాజీనామా చేయాలి 

జాజిరెడ్డిగూడెం(అర్వపల్లి), అక్టోబర్ 10: 'సర్' ను రద్దు చేయాలని, కేంద్ర ఎన్నికల ప్రధాన అధికారి జ్ఞానేష్ కుమార్(Chief Election Commissioner Gyanesh Kumar) రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ మండల కేంద్రం అర్వపల్లిలోని ప్రధాన రహదారిపై వామపక్ష,ప్రజాసంఘాల ఆధ్వర్యంలో శనివారం నిరసన తెలిపారు.

ఈ సందర్భంగా సామాజిక తెలంగాణ మహాసభ జిల్లా(Social Telangana Mahasabha District) కన్వీనర్ దడిపల్లి వెంకట్,ఎంసీపీఐయూ నేత ఈదురు వీరపాపయ్యలు మాట్లాడుతూ దేశంలో 13 కోట్ల దళిత,ముస్లిం ఓట్లు తొలగించి ప్రజాస్వామ్యాన్ని ధ్వంసం చేస్తున్నారని ఆరోపించారు. 2023 ఎన్నికల కమిషన్ చట్టాన్ని(Election Commission Act) రద్దు చేసి,పేపర్ బ్యాలెట్(Paper ballot) తో ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) నేతలు కొప్పోజు యాదగిరి,సరోజ,నాగరాజు,మహేష్,రవి,సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు