కో ఆప్షన్,నామినేటెడ్ పదవుల్లో అవకాశం కల్పించాలి.!

24-10-2026 | 08:31pm

సామాజిక కార్యకర్త సయ్యద్ బషీరుద్దీన్

కోదాడ అక్టోబర్ 24(విజయ క్రాంతి) : మున్సిపల్ ఎన్నికలు(Municipal Elections) పూర్తి అయి 7 8 నెలలు గడుస్తున్నా నామినేటెడ్ కోఆప్షన్ పదవుల(Nominated co-option positions) భర్తీకి వుసే లేదు. నామినేటెడ్ అయినా ఆయా కేటగిరీలకు చెందిన రిజర్వేషన్ రోస్టర్(Reservation Roster) నిబంధనలతో ఉన్న ఈ పదవుల్ని సేవ చేసే అవకాశం ఉన్నవారికి ప్రాధాన్యం ఇచ్చే విధంగా భర్తీ చేయాలని సామాజిక కార్యకర్త సయ్యద్ బషీరుద్దీన్ శనివారం కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రిస్టియన్ ముస్లిం మైనార్టీ బిసి సామాజిక ఉద్యమ కర్తలకు గ్రంథాలయ మున్సిపల్ కోఆప్షన్ లో పదవులుంటాయి.   

ప్రభుత్వం సమర్ధత రాజకీయ విజ్ఞత ప్రదర్శించే విధంగా పార్టీ కార్యకర్తలకు సోషల్ యాక్టివిస్టులకు అవకాశం కల్పించి తమ విజ్ఞతను చాటుకోవాలి. సమాజం పట్ల అవగాహన ప్రశ్నించి పోరాడి ముందుచూపు ఆలోచన విధానాలు అందించే ఉద్యమకర్తలకు సైతం అవకాశం ఇచ్చే విధంగా స్థానిక ఎమ్మెల్యే,మున్సిపల్ శాఖ విజ్ఞత ప్రదర్శించి వీరి సేవల్ని వినియోగించుకోవాలని మనవి చేశారు.

మరిన్ని వార్తలు