కిట్స్ ఎలక్ట్రానిక్స్ విద్యార్థుల క్షేత్రస్థాయి పర్యటన

02-10-2026 | 08:01pm

కోదాడ అక్టోబర్ 2, (విజయక్రాంతి): కోదాడలోని కిట్స్ మహిళా ఇంజనీరింగ్ కళాశాల(KITS Women's Engineering College) విద్యార్థులు ఇండస్ట్రియల్ విజిట్ లో భాగంగా  బీటెక్ ఎలక్ట్రానిక్స్ మూడవ సంవత్సరం చదువుతున్న విద్యార్థులు శుక్రవారం హైదరాబాద్ లోని  ఎల్ ఈ డి మ్యానుఫ్యాక్చరింగ్ చిప్ ఇండస్ట్రీని సందర్శించడం జరిగింది.

ఈ క్షేత్రస్థాయి పర్యటనలో ఎల్ ఈ డి చిప్ ఇండస్ట్రీ సీనియర్ అసిస్టెంట్  నరేష్ విద్యార్థినులకు ఎల్ ఈ డి చిప్స్ ప్రాధాన్యత గురించి విద్యార్ధులకు విపులంగా వివరించారు. ఈ క్షేత్ర స్థాయి పర్యటనలో కళాశాల అద్యాపకులు తమేష్ కుమార్, పుష్ప లత విద్యార్థులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ పెరుమాళ్ళపల్లి గాంధీ, అధ్యాపకతులు, విద్యార్థినులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు