ఘనంగా గాంధీ జయంతి వేడుకలు
కల్లూరు,అక్టోబర్ 02 (విజయక్రాంతి): కల్లూరులోని తెలంగాణ గ్రామర్ స్కూల్‌లో గాంధీ జయంతి(Gandhi Jayanti) వేడుకలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల చైర్మన్ జానిమియా,ప్రిన్సిపాల్ ఇస్మాయిల్, ఉపాధ్యాయులు, విద్యార్థులు మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
అనంతరం విద్యార్థులు గాంధీజీ సత్యం, అహింస, శాంతి, స్వచ్ఛత వంటి ఆశయాలపై ప్రసంగించారు.చైర్మన్ జానిమియా మాట్లాడుతూ గాంధీజీ చూపిన సత్యం,అహింస మార్గాలను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని,విద్యార్థులు క్రమశిక్షణ,నిజాయితీ, సేవాభావంతో మంచి పౌరులుగా ఎదగాలని ఆకాంక్షించారు.గాంధీజీ ఆశయాలను ఆచరణలో పెట్టడమే ఆయనకు అందించే నిజమైన నివాళి అని ప్రిన్సిపాల్ ఇస్మాయిల్ అన్నారు.
అలాగే మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీడీవో చంద్రశేఖర్ గాంధీజీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. మున్సిపాలిటీ కార్యాలయంలో, ఆర్యవైశ్య కళ్యాణ మండపం నందు కల్లూరు మున్సిపల్ చైర్మన్ ఆధ్వర్యంలో గాంధీజయంతి వేడుకల్లో పాల్గొన్న కాంగ్రెస్ నాయకులు మాజీ ఏఎంసీ చైర్మన్ నీరజ చౌదరి కల్లూరు యూత్ ప్రెసిడెంట్ ఆలకుంట నరసరావు కల్లూరు ఆర్యవైశ్య నాయకులు కాటేపల్లి కిరణ్ కృష్ణారెడ్డి యాస శ్రీకాంత్ ఏనుగు సత్యంబాబు సోషల్ మీడియా విజయరావు దామాల సురేష్ ,మున్సిపాలిటీ సిబ్బంది, మండల పరిషత్ కార్యాలయ సిబ్బంది,తదితరులు పాల్గొన్నారు.