సెంట్రల్ జీఎస్టీ ఇన్‌స్పెక్టర్‌గా విజ్ఞేశ్ ఎంపిక..
నిర్మల్, అక్టోబర్ 2 (విజయక్రాంతి): మూడారపు శ్రీనివాస్ కుమారుడు విజ్ఞేశ్(Vignesh) సెంట్రల్ కస్టమ్స్ అండ్ జీఎస్టీ ఇన్‌స్పెక్టర్‌గా నియమితులైన సందర్భంగా నిర్మల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జ్ కూచాడి శ్రీహరిరావు(Congress in-charge Kuchadi Sriharirao) ఆయనను అభినందించారు. ఈ సందర్భంగా విజ్ఞేశ్‌కు శాలువా కప్పి ఘనంగా సత్కరించారు. ఉన్నతమైన ప్రభుత్వ ఉద్యోగాన్ని సాధించిన విజ్ఞేశ్‌ను అభినందిస్తూ, భవిష్యత్తులో మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో నిర్మల్ మార్కెట్ కమిటీ చైర్మన్ సోమా భీంరెడ్డి , మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎరవత్ రాజేందర్ , ఆత్మ కమిటీ చైర్మన్ రామ్ రెడ్డి, మామడ మండల మాజీ అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి, గండి రామాలయ టెంపుల్ మాజీ చైర్మన్ గంగోని భూరాజ్ , రమణ , పుదారీ అరవింద్ తదితరులు పాల్గొని విజ్ఞేశ్‌కు అభినందనలు తెలిపారు.