ఆడుకుంటామని వెళ్లిన... బాలురు అదృశ్యం

03-10-2026 | 12:16am

మెడిపల్లి, అక్టోబర్ 2 (విజయక్రాంతి): ఆడుకుంటామని ఇంటి నుండి బయటకు వెళ్లిన ఇద్దరు బాలురు అదృశ్యమైన సంఘటన మేడిపల్లి పోలీస్ స్టేషన్(Medipally Police Station) పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం శుక్రవారం సెలవు దినం కావడంతో, థాబెటి సాయి నాథ్ లోకేష్ అనే బాలుడు తన స్నేహితుడు, బొడుప్పల్‌లోని మల్లికార్జున్ నగర్‌లో నివసించే వీర్నగరి సాయి,(14) తో ఉదయం 10:00 గంటల వరకు ఇంట్లో ఆడుకుని, అనంతరం బయట ఆడుకోవడానికి వెళ్తున్నామని చెప్పి వెళ్లారు.

ఇంటికి తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు వారి కోసం బంధువులు, స్నేహితులు, తెలిసిన వ్యక్తుల వద్ద విచారణ చేసి, చుట్టుపక్కల అన్ని ప్రదేశాలలో  వెతికిన ఆచూకీ లభించకపోవడంతో, థాబెటి సాయి నాథ్ లోకేష్ తల్లి థాబెటి శ్రీలత మేడిపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు కేసు నమోదు చేసి,  దర్యాప్తు చేస్తున్నామని, బాలురకు సంబంధించిన సమాచారం ఎవరికైనా తెలిసిన,మేడిపల్లి పోలీసులను సంప్రదించాలని  తెలిపారు.

మరిన్ని వార్తలు