గాంధీ జయంతి సందర్భంగా తెలంగాణ రక్షణ సేన ఘన నివాళులు
కరీంనగర్ సిటీ అక్టోబర్02 (విజయక్రాంతి): మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా కరీంనగర్ జిల్లా కోతిరాంపూర్ చౌరస్తాలో ఉన్న మహాత్మా గాంధీ విగ్రహానికి తెలంగాణ రక్షణ సేన(Telangana Rakshana Sena) ఆధ్వర్యంలో పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా తెలంగాణ రక్షణ సేన జిల్లా పార్టీ అధ్యక్షుడు గుంజపడుగు హరిప్రసాద్ మాట్లాడుతూ, మహాత్మా గాంధీ అహింస, శాంతి, సత్యాగ్రహం వంటి విలువలను ఆచరించి దేశ ప్రజలకు మార్గదర్శకంగా నిలిచారని. స్వాతంత్ర్య సమరంలో గాంధీజీ పోషించిన పాత్రను దేశ ప్రజలు ఎప్పటికీ మరువలేరని పేర్కొన్నారు.
గాంధీజీ కలలు కన్న స్వచ్ఛమైన, సమానత్వంతో కూడిన సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆయన పిలుపు నిచ్చారు. గాంధీజీ చూపిన సత్యం, అహింస మార్గాలను నేటి యువత ఆదర్శంగా తీసుకొని సమాజ అభివృద్ధికి తమ వంతు బాధ్యతను నిర్వర్తించాలని కోరినారు. ప్రజలలో ఐక్యత, సోదరభావం, సామాజిక బాధ్యతను పెంపొందించేందుకు తెలంగాణ రక్షణ సేన నిరంతరం కృషి చేస్తుందని జిల్లా అధ్యక్షుడు గుంజపడుగు హరిప్రసాద్ అన్నారు.
ఈ కార్యక్రమంలో తెలంగాణ రక్షణ సేన అసెంబ్లీ నియోజకవర్గం ఇంచార్జ్ అంకం శివరాణి, జిల్లా మహిళ విభాగం అధ్యక్షురాలు పిన్నింటి సంగీత రెడ్డి, నగర పార్టీ అధ్యక్షుడు రంగరవేణి లక్ష్మణ్, జిల్లా పార్టీ నాయకులు మ్యాకల తిరుపతి, బసవేణి రాజేందర్, చంటి శ్రీనివాస్, శ్రీరాముల రమేష్, గాలిపల్లి రత్నాకర్ చారి, నూతి సాయిచరణ్, నగునూరి రమేష్, బండారి అభిరామ్, జంగ అపర్ణ సాగర్, కొలిపాక గౌతమి, దాసరి అంజలి తదితరులు పాల్గొన్నారు.