మామునూరు విమానాశ్రమంకు దొడ్డి కొమురయ్య పేరు పెట్టాలి

02-10-2026 | 11:59pm

-తెలంగాణ ఇంటలేక్షవల్ ఫోరం డిమాండ్ 

హనుమకొండ, అక్టోబర్ 2 (విజయక్రాంతి): మామునూరు విమానాశ్రయం(Mamunooru Airport) దొడ్డి కొమరయ్య పేరు పెట్టాలని తెలంగాణ ఇంటలెక్చువల్ ఫోరం ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో సీనియర్ జర్నలిస్ట్ పాశం యాదగిరి హాజరై మాట్లాడుతూ ప్రపంచంలోనే తెలంగాణ మట్టి మనుషులు చేసిన సాయుధ పోరాటం ఉద్యమాల చరిత్రలో ప్రాముఖ్యత సంతరించుకుంది.

1946 జూలై 4న తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట చరిత్రలో తుపాకీ గుళ్లకు ఎదురుగా నిలిచి దొడ్డి కొమరయ్య అమరత్వం పొందడం జరిగింది గుర్తుగా వరంగల్ మామునూరు ఎయిర్పోర్ట్ కు దొడ్డి కొమరయ్య పేరును పెట్టడం అమరవీరులకు మనం ఇచ్చే నివాళిగా ఇంటలెక్చువల్ ఫోరం భావిస్తుంది ప్రజలను నానా ఇబ్బందులకు గురిచేసిన రాజరికపు చరిత్రలు భూస్వామ్య దోపిడీ చరిత్రలో తెలంగాణ నిర్మాణాలకు అవసరం లేదని ప్రజల కోసం ప్రాణాలు ఇచ్చిన వీరుల పేర్లు పెట్టాలని సూచించారు.

కులాలకు మతాలకు అతీతంగా దొడ్డి కొమురయ్య పేరు సమచితంగా ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేయడం జరిగిందన్నారు.ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో అజాద్, కడమంచి రాంబాబు, పోతరాజు రమేష్, ఐలయ్య, మహేష్, పాణి, శ్రావణ్, శివ, తిరుపతి, లింగయ్య, శ్రీనివాస్, చార్వాక, కోడల ప్రసాద్, ప్రభాకర్, విద్యార్థి యువజన ప్రజాసంఘాల నాయకులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు