శ్రీనగర్ కాలనీలో అన్నదానం
20-09-2026 | 05:17pm
భారీ సెట్టింగ్ లతో గణేష్ మండపం
కోదాడ సెప్టెంబర్ 20, (విజయక్రాంతి): కోదాడ శ్రీనగర్ కాలనీ 17వ వార్డు ఎమ్మెల్యే పద్మావతి(MLA Padmavati) ఇంటి దగ్గరలో గణేష్ ఉత్సవ కమిటీ(Ganesh Utsav Committee) ఆధ్వర్యంలో ఆదివారం అన్నదానం నిర్వహించారు. భారీ సెట్టింగ్ లతో గణేష్ మండపాన్ని ఏర్పాటు చేసి గణేష్ నవరాత్రి ఉత్సవాలను కన్నుల పండుగగా నిర్వహిస్తున్నారు. మండపం ఆవరణలో రకరకాల జ్యోతిర్లింగాలు ప్రత్యేక ఆకర్షణగా ఏర్పాటు చేశారు. తిలకించేందుకు ఆదివారం వందలాదిమంది భక్తులు ప్రజలు మండపాలకు తరలివచ్చారు. అదేవిధంగా గణేష్ భారీ విగ్రహం, ప్రత్యేక పూజలు అందరినీ ఆకర్షిస్తున్నాయి కమిటీ వారు నిర్వహించే పూజలలో ప్రతిరోజు అధిక సంఖ్యలో ప్రజలు పాల్గొంటున్నారు.