ఉపాధి హామీ కూలీలకు అండగా దండె అపర్ణ..

02-11-2026 | 07:30pm

పండ్లు, మంచినీళ్ల పంపిణీ...

శివంపేట, నవంబర్ 2 (విజయక్రాంతి ): శివంపేట మండలంలోని నవాబుపేట, పెద్దగొట్టిముక్కుల, తిమ్మాపూర్ తదితర గ్రామాల్లో తెలంగాణ రక్షణ సేన పార్టీ(Telangana Rakshana Sena Party) నర్సాపూర్ నియోజకవర్గ(Narsapur constituency) ఇన్‌చార్జి దండె అపర్ణ ఉపాధి హామీ కూలీలకు అండగా నిలిచారు. క్షేత్రస్థాయిలో పనులు చేస్తున్న నిరుపేద కూలీల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని వారికి పండ్లు, మంచినీళ్ల బాటిళ్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె స్వయంగా పని ప్రదేశాలకు వెళ్లి కూలీలతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా దండె అపర్ణ మాట్లాడుతూ.. గ్రామీణ అభివృద్ధిలో ఉపాధి హామీ కూలీల పాత్ర ఎంతో కీలకమని, ఎండను సైతం లెక్కచేయకుండా శ్రమిస్తున్న కూలీలకు అండగా నిలవడం తన బాధ్యతగా భావిస్తున్నానని తెలిపారు. తెలంగాణ రక్షణ సేన పార్టీ ఎల్లప్పుడూ నిరుపేదలు, కార్మికుల సంక్షేమం కోసం పనిచేస్తుందని పేర్కొన్నారు. కూలీల కష్టాన్ని గుర్తించి పండ్లు, మంచినీళ్లు అందజేయడంపై కూలీలు హర్షం వ్యక్తం చేస్తూ ఆమెకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, ఉపాధి హామీ కూలీలు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు