"ట్యూటరిక్స్"హైదరాబాద్ వారి ఆధ్వర్యంలో డిజిటల్ లెర్నింగ్
అవగాహన కార్యక్రమం
నేరేడుచర్ల, అక్టోబర్03(విజయ క్రాంతి): పిఎంశ్రీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల(PM SHRI Zilla Parishad High School) నేరేడుచర్ల నందు ట్యూటరిక్స్" హైదరాబాద్ వారు పునీత్, పార్థున్ జై ల ఆధ్వర్యంలో ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయులు మరియు పాఠశాల విద్యార్థులకు డిజిటల్ లెర్నింగ్ పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
అనంతరం మండల ఎంఈఓ ఎం బాలు మాట్లాడుతూ సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించుకొని ఉపాధ్యాయులు, విద్యార్థులు విద్యా ప్రమాణాలు, అభ్యసనా సామర్ధ్యాలు సాధించే అవకాశాలున్నాయని, ఉన్నత ప్రమాణాలు సాధించే క్రమంలో సాంకేతికతను సద్వినియోగపరచుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు బి మధు,పి సత్యనారాయణ రెడ్డి, ఎల్ శ్రీనివాసరావు, వెంకట్ రెడ్డి, రవీందర్ రెడ్డి, పరశురాములు, లింగయ్య ఉపాధ్యాయులు ఎం సైదులు, జానకి రాములు, భానుమతి, బికోజి, వీరారెడ్డి,స్వప్న తదితరులు పాల్గొన్నారు.