సామాజిక న్యాయం కోసం నిజాయితీగా పని చేస్తా
మేడ్చల్ నియోజకవర్గ ఎస్సీ విభాగం ఏ బ్లాక్ అధ్యక్షుడుగా మాట్ల క్రాంతి కుమార్ ఎన్నిక
జవహర్ నగర్,(విజయక్రాంతి): అణగారిన వర్గాలకు ఆత్మ బంధువును అవుతానని సామాజిక న్యాయం కోసం నిజాయితీగా పని చేస్తానని మేడ్చల్ జిల్లా నియోజకవర్గ ఎస్సి విభాగం ఏ బ్లాక్(Medchal SC Block) అధ్యక్షుడుగా ఎన్నికైన మాట్ల క్రాంతి కుమార్(Matla Kranthi Kumar) పేర్కొన్నారు. మేడ్చల్ నియోజకవర్గ ఎస్సీ విభాగం ఏ బ్లాక్ అధ్యక్షులుగా జవహర్ నగర్ కు చెందిన మాట్ల క్రాంతి కుమార్ నియమితులయ్యారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీ అధిష్టానానికి రాష్ట్ర నాయకత్వానికి తనపై నమ్మకం ఉంచి ఈ బాధ్యతలు అప్పగించిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)కి, టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, మేడ్చల్ డిసిసి అధ్యక్షులు తోటకూర వజ్రేష్ యాదవ్ కు కృతజ్ఞతలు తెలియజేశారు. అలాగే మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా ఎస్సీ సెల్ చైర్మన్ కావాలి చంద్రయ్యకు ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.