డబ్బు కోసం రాయలేదు

17-11-2026 | 05:05am
  1. అందరికీ నిజం తెలియాలి
  2. శాండ్‌పేపర్ వివాదంపై ఖవాజా

సిడ్నీ, నవంబర్ 16: మాజీ క్రికెటర్ ఉస్మా న్ ఖవాజా(Former cricketer Usman Khawaja) ఆటో బయోగ్రఫీ(Autobiography) సబ్ ఆస్ట్రేలియా క్రికెట్‌ను(Australian Cricket) కుదిపేస్తోంది. ముఖ్యంగా 2018లో జరిగిన శాండ్‌పేపర్‌తో(Sandpaper) బాల్ ట్యాంపరింగ్(Ball tampering) వివాదంపైనే ఇప్పుడు తీవ్ర చర్చ నడుస్తోంది. ట్యాంపరింగ్ విషయం జట్టులో ప్రతీ ఒక్కరికీ తెలుసంటూ ఖవాజా పేర్కొన్నాడు. దీనికి మరో మాజీ క్రికెటర్ డేవిడ్ వార్నర్ కూడా మద్ధతు పలికాడు. అ యితే ఈ వ్యాఖ్యలను పాట్ కమిన్స్ ఖండించాడు. ఈ నేపథ్యంలో ఖవాజా పుస్తకంపై విమర్శలు వచ్చాయి. తాజాగా ఈ విమర్శల పై ఖవాజా స్పందించాడు.

తాను డబ్బు కోసం ఈ పుస్తకం రాలేదన్నాడు. దేవుడు తనకు చాలా డబ్బు ఇచ్చాడనీ చెప్పాడు. కొత్తగా ఇంకా డబ్బు వచ్చినా తన జీవితం లో ఎలా మార్పు రాదని స్పష్టం చేశాడు. ట్యాంపరింగ్ వివాదంలో వార్నర్, స్మిత్, బెన్‌క్రాఫ్ట్‌లకు అన్యాయం జరిగిందని, అం దుకే వారి తరపున నిలబడ్డానని చెప్పుకొచ్చాడు. నిజం అందరికీ తెలియాలన్న ఉద్దే శ్యంతోనే పుస్తకంలో వెల్లడించానని తెలిపాడు. తన పుస్తకం వెనుక ఎలాంటి వాణి జ్య ప్రయోజనాలు లేవని ఖవాజా స్పష్టం చేశాడు. వ్యక్తిగత లాభం కోసమో, పుస్తకం అమ్ముకోవడం కోసమే తాను ఈ విషయా లు బయటపెట్టలేదని తేల్చిచెప్పాడు.

మరిన్ని వార్తలు