ఖేలో ఇండియా లోగో, మస్కట్ ఆవిష్కరణ
మధిర, నవంబర్ 18: తెలంగాణ వేదికగా డిసెంబర్ 11 నుంచి 22 వరకు నిర్వ హించనున్న ఖేలో ఇండియా యూత్ గేమ్స్ 2026కు సంబంధించిన లోగో, మస్కట్, బ్రోచర్‌ను రాష్ట్ర క్రీడల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి(Telangana Sports Minister Vakit Srihari) ఖమ్మం జిల్లా మధిరలో ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా మంత్రి వాకిటి శ్రీహరి మాట్లాడుతూ ప్రతిష్ఠాత్మకమైన ఖేలో ఇండియా యూత్ గేమ్స్‌కు తెలంగాణ ఆతిథ్యం ఇవ్వడం రాష్ట్రానికి దక్కిన గొప్ప గౌరవమని పేర్కొన్నారు.ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణను జాతీయ, అంతర్జాతీయ క్రీడలకు ప్రధాన కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. రాష్ట్రంలో క్రీడా మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడంతోపాటు గ్రామీణ ప్రాం తాల్లోని ప్రతిభావంతులైన క్రీడాకారులను గుర్తించి ప్రోత్సహిస్తున్నామని తెలిపారు.
ఈ జాతీయ క్రీడాపోటీలను విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని శాఖల సమన్వయంతో ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి వచ్చే క్రీడాకారులు, కోచ్‌లు, అధికారులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. క్రీడలు కేవలం పతకాల సాధనకే పరిమితం కావని, యువతలో క్రమశిక్షణ, నాయకత్వ లక్షణాలు, ఆత్మ విశ్వాసం పెంపొందించేందుకు దోహదపడతాయని మంత్రి పేర్కొన్నారు. ఖేలో ఇండియా యూత్ గేమ్స్ నిర్వహణను విజయవంతం చేయడంలో క్రీడాకారులు, క్రీడా భిమానులు, యువత, ప్రజలందరూ భాగస్వాములు కావాలని మంత్రి వాకిటి శ్రీహరి పిలుపునిచ్చారు.