ఖేలో ఇండియాకు కౌంట్ డౌన్

17-11-2026 | 05:15am

ప్రతిష్టాత్మక క్రీడలకు సిద్ధమవుతున్న తెలంగాణ

* దేశవ్యాప్తంగా యువక్రీడాప్రతిభను వెలికితీసేందుకు కేంద్రం తీసుకొచ్చిన అతిపెద్ద క్రీడాసంబురం ఖేలో ఇండియా యూత్ గేమ్స్. ఎనిమిదేళ్ల క్రితం మొదలైన ఈ గేమ్స్ వచ్చే నెలలో తెలంగాణ వేదికగా జరగబోతున్నాయి. ఇప్పటికే ఈ జాతీయ స్థాయి క్రీడాసంబురం కోసం ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. దాదాపు 225 కోట్ల రూపాయల బడ్జెట్‌తో ఖేలో ఇండియా గేమ్స్ 8వ ఎడిషన్ నిర్వహించబోతున్నారు.

  1. భారీస్థాయిలో ఏర్పాట్లు
  2. బరిలో 8 వేల మంది అథ్లెట్లు
  3. గేమ్స్‌కు రూ.224.30 కోట్ల బడ్జెట్

హైదరాబాద్, నవంబర్ 16 : కామన్వెల్త్ గేమ్స్, ఒలింపిక్స్(Commonwealth Games, Olympics) వంటి అంతర్జాతీయ వేదికలపై భారతదేశం మరిన్ని పతకాలు సాధిం చేలా అథ్లెట్లను తీర్చిదిద్దే లక్ష్యంతో మొదలైన ఖేలో ఇండియా యూత్ గేమ్స్‌కు(Khelo India Youth Games) తొలిసారి తెలంగాణ ఆతిథ్యమివ్వబోతోంది(Telangana Hosts). డిసెంబర్ 11 నుంచి 22 వరకూ 12 రోజుల ఈ జాతీయస్థాయి క్రీడాపోటీలు అభిమానులను అలరించబోతున్నాయి. ప్రతిష్టాత్మక ఈవెం ట్ కావడంతో వీటిని అద్భుతంగా నిర్వహించేందుకు తెలంగాణ ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది.

క్రీడల నిర్వహణతోపాటు క్రీడాకారులు, సిబ్బందికి ఎలాంటి ఇబ్బందులు రాకుండా దేశం గర్వించేవిధంగా ఏర్పాట్లను ముమ్మరం చేసింది. దేశవ్యాప్తంగా దాదాపు 8 వేల మందికి పైగా క్రీడాకారులు ఈ సారి గేమ్స్‌లో పాల్గొనబోతున్నట్టు అంచనా. వీరితోపాటు సుమారు 2 నుంచి 3 వేల మంది కోచింగ్ సిబ్బంది, అధికారులు పాల్గొనే అవకాశం ఉంది. మొత్తం 27 క్రీడాంశాలతో పాటు ఒక ప్రదర్శనాత్మక క్రీడలో పోటీలు జరగనున్నాయి. ఖేలో ఇండియా యూత్ గేమ్స్ కోసం రూ.224.30 కోట్ల బడ్జెట్‌ను కేటాయించారు.

దీనిలో తెలంగాణ రాష్ట్రం వాట రూ.203.13 కోట్లు, కేంద్ర ప్రభుత్వం వాటా రూ.21.17 కోట్లుగా ఉంది. స్టేడియాల ఆధునీకరణ కోసం రూ.60 కోట్లు కేటాయించారు. అలాగే క్రీడా పరికరాల కొనుగోలు కోసం రూ.60 కోట్లు కేటాయించారు. వసతి, క్యాటరింగ్, రవా ణా సౌకర్యాలకు రూ.45 కోట్లు, అత్యాధునిక సౌకర్యాలు, బ్రాండింగ్ కోసం రూ.39.50 కోట్లు బడ్జెట్‌లో కేటాయిం చారు.  ఈ గేమ్స్ కోసం కేటాయించిన నిధులతో స్టేడియాలతో పాటు మౌలిక సుదుపాయాలు మరిం త మెరుగవనున్నాయి.

ఇదిలా ఉంటే హైదరాబాద్‌తో పాటు ఖమ్మం, హన్మకొండ, కరీంనగర్, నిజామాబాద్, మహబూబ్‌నగర్‌లో పోటీలు జరగనున్నాయి. ప్రధాన ఈవెంట్లన్నీ హైదరాబాద్‌లోనే జరగనుండగా, మహబూబ్‌నగర్‌లో కబడ్డీ, కరీంన గర్‌లో జూడో, నిజామాబాద్‌లో టేబుల్ టెన్నిస్, ఖమ్మంలో ఆర్చరీ, హన్మకొండలో అథ్లెటిక్స్ నిర్వహించేలా ప్ర ణాళికలు సిద్ధం చేశారు. హైదరాబాద్‌లోని 6 వేదికల్లో పోటీలు జరగనున్నాయి.

బాస్కెట్‌బాల్, ఫెన్సింగ్ క్రీడలకు యూసఫ్‌గూడ స్టేడియం బాక్సింగ్, రెజ్లింగ్, యోగాసన పోటీలకు సికింద్రాబాద్ ఆర్‌ఆర్‌సీ ఇండోర్ స్టేడియం, సాఫ్ట్‌బాల్, టెన్నిస్ పోటీలకు ఎల్బీ స్టేడియం, రోయింగ్, సెయిలెంగ్ పోటీలకు హుస్సే టన్ సాగర్ ఆతిథ్యమివ్వనున్నాయి. అలాగే గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో బ్యాడ్మింటన్, వాలీబాల్, హాకీ, స్విమ్మింగ్ పోటీలు జరగనున్నాయి. సరూర్‌నగర్ ఇండోర్ స్టేడియం లో జిమ్నాస్టిక్స్, ఖోఖో నిర్వహించనున్నారు. హైదరాబాద్ సెం ట్రల్ యూనివర్సిటీలో షూటింగ్ పోటీలు, ఓయూ క్యాంపస్‌లో సైక్లింగ్ పోటీలు నిర్వహించనున్నారు.

హకీంపేట లోని తెలంగాణ స్టేట్ స్పోర్ట్స్ స్కూల్‌లో వెయిట్‌లిఫ్టింగ్ పోటీలకు ఏర్పాటు చేస్తున్నారు. ఈ భారీ క్రీడాసంబురంలో తెలంగాణ క్రీడాకారులు సత్తా చాటా లని పలువురు కోరుకుంటున్నారు. గత ఎడిషన్‌లో తెలంగాణ 12వ స్థానంలో నిలిచింది. ఇప్పుడు సొంతగడ్డపై జరుగుతున్న క్రీడల్లో మరింత మెరుగైన ప్రదర్శనతో మంచి స్థా నం సాధించే అవకాశముంది.

అటు ఈ క్రీడ ల్లో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన క్రీడాకారులను రాష్ట్ర ప్రభు త్వం అంతర్జాతీయ స్థాయి శిక్షణ ఇచ్చేలా ప్రోత్సహించాలని క్రీడాభిమానులు కోరుతున్నారు. ఖేలో ఇండియా యూత్ గేమ్స్ 12 రోజుల ఈవెంట్‌లా మిగిలిపోకుండా గ్రామీణ క్రీడాకురుల భవిష్యత్తుకు బంగారు వారధిలా మారాలని చెబుతున్నారు.

మరిన్ని వార్తలు