వన్డే సిరీస్‌ క్లీన్‌స్వీప్‌

29-10-2026 | 05:05am

5 వికెట్లతో తిప్పేసిన వైష్ణవి

131 రన్స్‌కే జింబాబ్వే ఆలౌట్

3 సిరీస్ భారత్ కైవసం

సొంతగడ్డపై భారత మహిళల క్రికెట్ జట్టు అదరగొట్టింది. జింబాబ్వేతో జరిగిన వన్డే సిరీస్‌ను 3 క్లీన్ స్వీప్ చేసింది. ఆల్‌రౌండ్ షోతో సత్తా చాటిన భారత్ మూడో వన్డేలో 8 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది.వైష్ణవి శర్మ స్పిన్ మాయాజాలానికి జింబాబ్వే బ్యాటర్లు చేతులెత్తేశారు. కాగా కొత్త కెప్టెన్‌గా బాధ్యతలు అందుకున్న స్మృతి మంధానకు ఇదే తొలి సిరీస్ విజయం.

వడోదర, అక్టోబర్ 28: మొదట బ్యాటింగ్‌కు దిగిన జింబాబ్వేను భారత యువ స్పిన్నర్ వైష్ణవి శర్మ(Indian spinner Vaishnavi Sharma) తన స్పిన్‌తో తిప్పేసింది. ఆమె దెబ్బకు జింబాబ్వే కేవలం 131 పరుగులకే కుప్పకూలింది. ఓపెనర్ మోడెస్టర్ ముపాచిక్వా(48 బంతుల్లో 7 ఫోర్లతో 37), కెప్టెన్ జోసెఫిన్ న్కోమో (67 బంతుల్లో 4 ఫోర్లతో 35) టాప్ స్కోరర్లుగా నిలిచారు. భారత బౌలర్లలో వైష్ణవి శర్మ ఐదు వికెట్లతో జిం బాబ్వే పతనాన్ని శాసించగా.. క్రాంతి గౌడ్, సయాలీ సత్ఘరే రెండేసి వికెట్లు పడగొట్టారు.

132 పరుగుల లక్ష్య ఛేదనలో ఓపెనర్‌గా వచ్చిన యస్తికా భాటియా గోల్డెన్ డక్‌గా వెనుదిరిగింది.తర్వాత హర్లిన్ డియోల్, ప్రతీ కా రావల్ నిలకడగా ఆడారు. వీరిద్దరూ  రెండో వికెట్‌కు 58 పరుగులు జోడించారు. ఆచితూచి ఆడిన హర్లీన్ డియోల్(19) క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగింది. అనంతరం క్రీజులోకి వచ్చిన షెఫాలీ వర్మ జింబాబ్వే బౌలర్లపై విరుచుకుపడింది. మరోవైపు ప్రతీకా రావల్ 47 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకుంది.

ప్రతీకా రావల్ నిదానంగా ఆడినా.. షెఫా లీ వర్మ టీ20 తరహా బ్యాటింగ్‌తో చెలరేగింది. విన్నింగ్ షాట్‌గా భారీ సిక్సర్ బాది 26 బంతుల్లో హాఫ్ సెంచరీతో పాటు టీ మిండియా విజయాన్ని పూర్తి చేసింది. భారత్ 17 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి టార్గెట్ అందుకుంది. ప్రతీకా రావల్ 59 నాటౌట్ (4 ఫోర్లు, 3 సిక్స్లర్లు), షెఫాలీ వర్మ 51 నాటౌట్ (26 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్సర్లు) అజేయ హాఫ్ సెంచరీలతో భారత విజయంలో కీలక పాత్ర పోషించారు. వైష్ణవి శర్మకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్, ప్రతీకా రావల్‌కు ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డులు దక్కాయి. అంతకుముందు టీ20 సిరీస్‌ను కూడా భారత్ 3 స్వీప్ చేసింది.

స్కోరు బోర్డు

జింబాబ్వే ఇన్నింగ్స్ : 131 (ముపాచిక్వా 37,  జోసెఫిన్ 35, దురురు 20; వైష్ణవి శర్మ 5/39, క్రాంతి గౌడ్ 2/23, సయాలీ 2/11) 

భారత్ ఇన్నింగ్స్ : 133/2 ( ప్రతీకా రావల్ 59 నాటౌట్, షఫాలీ వర్మ 51 నాటౌట్; సిబాండ 1/18, ఫిరి 1/28)

మరిన్ని వార్తలు