బీరు సీసాతో దాడి

29-10-2026 | 10:15am

మిరియాల గ్రామంలో బీఆర్ఎస్ వెంకన్న పై బీర్ సీసాతో దాడి.

గ్రామంలో పాత కక్షలతోనే దాడి, పరమేష్ పై కేసు నమోదు.

తుంగతుర్తి (విజయక్రాంతి): సూర్యాపేట జిల్లా నూతనకల్ మండలం మిర్యాల గ్రామంలో బుధవారం రాత్రి కాంగ్రెస్ నాయకుడు(Congress Leader Attacks) మన్నెం పరమేష్ ఇంటిలో పుట్టినరోజు వేడుకలు నిర్వహించి, ఇంటి బయట ఉండగా, బీఆర్ఎస్ నాయకుడు కనకటి వెంకన్న (అలియాస్) మొండి వెంకన్న రాత్రి 11 గంటల సమయంలో మూత్రం పోశాడని ఆగ్రహానికి గురై, పాత కక్షలు దృష్టిలో పెట్టుకుని పరమేశ్, వెంకన్న పై బీరు సీసాతో దాడి చేశాడు. తలకు బలమైన గాయం కావడంతో నాలుగు కుట్లు వేసినట్లు పోలీసులు తెలిపారు. జరిగిన సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి, విచారణ చేపడుతున్నట్లు తుంగతుర్తి సీఏ ఉపేందర్ రావు పేర్కొన్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తుగా గ్రామంలో పోలీస్ ఫికెటింగ్ ఏర్పాటు చేశారు.

మరిన్ని వార్తలు