మరో 15 వేల ఉద్యోగాలు

29-10-2026 | 05:25am
  1. త్వరలోనే నోటిఫికేషన్లు జారీ
  2. ‘పీఎస్‌ఆర్ యువ నేస్తం’తో ఉచిత ఆన్‌లైన్ శిక్షణ
  3. హైదరాబాద్‌కు రాకుండానే కోచింగ్ తీసుకునే ఛాన్స్    
  4. దీపావళిలోగా జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు
  5. మంత్రి పొంగులేటి వెల్లడి

హైదరాబాద్, అక్టోబర్ 28 (విజయక్రాంతి): ఉద్యోగాల భర్తీకి ప్రజాప్రభుత్వం అత్యంత ప్రాధాన్యమిస్తోందని, త్వరలో మరో 15 వేల ఉద్యోగా ల ను భర్తీ చేయనున్నట్లు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి(Minister Ponguleti Srinivas Reddy) వెల్లడించారు. రానున్న కాలంలోనూ మరిన్ని ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు వెలువడుతాయన్నారు. ఇప్పటికే 72 వేల ఉద్యోగాలను భర్తీ చేసినట్లు గుర్తు చేశారు. మంత్రి పొంగులేటి పుట్టిన రోజును పురస్కరించుకుని బుధవారం సచివాలయంలోని తన ఛాంబర్‌లో ప్రభుత్వ ఉద్యోగాల అభ్యర్థుల కోసం ఉచిత ఆన్‌లైన్ శిక్షణ అందించే ‘పీఎస్‌ఆర్ యువ నేస్తం’ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు.

ఈ కార్యక్రమంలో మంత్రి వాకిటి శ్రీహరి, ఎంపీ రామ సహాయం రఘురామిరెడ్డి, ఎమ్మెల్యేలు వేముల వీరేశం, లక్ష్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఆర్థిక ఇబ్బందులు, శిక్షణ ఖర్చులు, దూరప్రాంతాల సమస్య లు యువత లక్ష్యసాధనకు అడ్డంకులు కాకూడదనే ఉద్దేశంతోనే ఉచిత ఆన్‌లైన్ శిక్షణకు శ్రీకారం చుట్టినట్లు వివరించారు.

ఉద్యోగాలకు సిద్ధమవుతున్న వారికి సరైన మార్గదర్శకత్వం, నాణ్యమైన శిక్షణ ఎంతో అవసరమని, అందుకోసం పీఎస్‌ఆర్ ఛారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పీఎస్‌ఆర్ యువ నేస్తం పేరిట ఆన్‌లైన్‌లో ఎన్ని లక్షల మందికైనా   గత 30 ఏళ్లుగా ఆర్సీ ఎగ్జామ్స్ సంస్థ ఎం తోమంది ప్రతిభావంతులను తీర్చిదిద్దిందని, ఐఏ ఎస్ వంటి ఉన్నతస్థాయి ఉద్యోగాలు సాధించేందుకు కూడా మార్గనిర్దేశం చేసిందని తెలిపారు. సంస్థలో కరీం, కృష్ణారెడ్డి, మేముల సైదులు వంటి అనుభవజ్ఞులైన అధ్యాపకులు, ఫ్యాకల్టీలు భాగస్వాములుగా ఉండటం అభ్యర్థులకుఎంతో ఉపయోగమన్నారు.

ఆన్‌లైన్ కోచింగ్ వల్ల అభ్యర్థులు హైదరాబాద్ రాకుండానే ఇళ్ల వద్ద నుంచే శిక్షణ పొందవచ్చని మంత్రి తెలిపారు. తద్వారా ఖర్చు, రవాణా చార్జీల భారం తప్పుతుందన్నారు. ఏడాది పాటు శిక్షణ కొనసాగుతుందని, అవసరమైతే పొడిగిస్తామని  తెలిపారు. గతంలో 2,300 మంది శిక్షణ పొంది 462 మంది ఉ ద్యోగాలు సాధించారని గుర్తు చేశారు.  జర్నలిస్టుల ఇండ్ల స్థలాల సమస్య దీపావళి లోగా పరిష్కరించేందుకు సీఎం రేవంత్‌రెడ్డి సమ్మతించారని వివరించారు.

మరిన్ని వార్తలు