ఎల్‌నినో ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు కొత్త ప్లాన్

29-10-2026 | 10:20am

ఎల్ నినో ప్రభావాన్ని అధికమించేందుకు ఫామ్ ఫండ్ లు

రైతుల చేనులో సత్ఫలితాలు ఇస్తున్న ఫామ్ ఫండ్  

కలెక్టర్, డి ఆర్ డి ఓ పి డి  చొరవతో గ్రామాల్లో పనులు

ఉట్నూర్, అక్టోబర్ 29 (విజయక్రాంతి):  దేశంలో ఎల్ నినో ప్రభావం తీవ్రంగా ఉంది. ఎల్ నినో ప్రభావంతో(El Niño's impact) వర్షాకాలంలో  సమృద్ధిగా వర్షాలు కురవలేదు... అడపాదడపగా పడిన వర్షాలతో  పంటలు చేతికి రాక రైతులు ఆందోళన చెందుతున్నారు. ఈ సమయంలోనే రైతులను, ప్రజలను జిల్లా కలెక్టర్ రాజర్శి షా, డి ఆర్ డి ఓ పి డి రాథోడ్ రవీందర్ లు క్షేత్రస్థాయి అధికారులను  అప్రమత్తం చేశారు. వి. బీ. జీ రామ్ జి పథకంలో ప్రతి ఇంటికి నీటిని ఇంకించేందుకు సోఫిట్స్, వ్యవసాయ చేనులో ఫామ్ ఫండ్ లు, బోర్ వెల్ వద్ద  వృధా నీటిని  భూమిలో ఇంకే విధంగా  బోర్ వెల్  సోఫిట్స్  నిర్మాణం చేయాలని మండల స్థాయి అధికారులు ఆదేశించారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఉట్నూర్ ఏజెన్సీ ప్రాంతంలో విబీజీరాంజీ పథకంలో ఫామ్ ఫండ్ ల నిర్మాణం ముమ్మరంగా  చేపట్టడంతోపాటు  కూలీలకు ఉపాధి కల్పిస్తున్నారు. గ్రామాల్లో ఫామ్ ఫండ్ లను కూలీలు తవ్వుతుండగా భూగర్భ జలాలు బయటకు వస్తున్నాయి. ఫామ్ ఫండ్  లో నీరు బయటకు రావడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

జిల్లాలో 1786 ఫామ్ ఫండ్లు.. 4760 సో ఫిట్స్.. అదిలాబాద్ జిల్లాలోని 20 మండలాల్లో  వి బీ జీ  రామ్ జి(VBG Ramji scheme)  పథకంలో  1786 ఫామ్ ఫండ్ ల నిర్మించుటకు జిల్లా కలెక్టర్ నిర్ణయించారు. డి ఆర్ డి ఓ  పిడి  రాథోడ్ రవీందర్ ఆధ్వర్యంలో  ఇప్పటివరకు  782 పనులు పూర్తి చేశారు. ఫామ్ ఫండ్ లు తవ్వే కూలీలకు ఉపాధితో పాటు  ఫామ్ ఫండ్  లు మంచి ఫలితాలు అందిస్తున్నాయి. ఫామ్ పండ్లతో పాటు  ఇంటింటికి  వృధా నీరు  బయటకు వెళ్లకుండా  4760 సోప్ స్వీట్స్, బోర్వెల్ నీరు నీటిని భూమిలో ఎక్కించే విధంగా  477 పనులను చేపట్టారు. ఈ పనులతో వృధా నీటిని  భూగర్భ జలంలో ఇంకే విధంగా  సిబ్బంది కృషి చేస్తున్నారు.

ఫామ్ ఫండ్  లు నిర్మాణానికి ముందుకు వస్తున్న రైతులు.. జిల్లాలోని మారుమూల గ్రామాలకు చెందిన రైతులు తమ వ్యవసాయ చేనులో  ఫామ్ ఫండ్  లను  నిర్మించుకునేందుకు  రైతులు ముందుకు వస్తున్నారు. వాల్గొండ గ్రామానికి చెందిన తొడసం లక్ష్మీబాయి  చేనులో రెండు రోజుల క్రితం  తవ్విన ఫామ్ ఫండ్ లను  చూసిన రైతులు తమ చేనులో సైతం నిర్మించాలని అధికారులను కోరుతున్నారు. ఈ దిశగా అధికారులు ప్రత్యేక కృషి చేస్తే ఎల్ నినో ను సమర్థవంతంగా ఎదురుకోవచ్చునని  ప్రజలు కోరుతున్నారు.

మరిన్ని వార్తలు