వెంటనే ఎస్‌జీఏం నిర్వహించండి
- హెచ్‌సీఏ సభ్యుల డిమాండ్
- సింగిల్ మెన్ కమిటీకి వినతిపత్రం
- తక్షణమే నిర్ణయం తీసుకోవాలని విజ్ఞప్తి
హైదరాబాద్, అక్టోబర్ 28: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(Hyderabad Cricket Association)లో నెలకొన్న పాలనాపరమైన సమస్యలు, సమావేశాల నిర్వహణపై హెచ్‌సీఏ సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. మాజీ ప్రెసిడెంట్ అర్షద్ అయూబ్, మాజీ సెక్రటరీ జాన్ మనోజ్‌తో పాటు పలువురు సభ్యులు మీడియా సమావేశం నిర్వహించారు.
ప్రస్తుత అపెక్స్ కౌన్సిల్ పదవీకాలం అక్టోబర్ 21తో ముగిసిన నేపథ్యంలో కొత్త కార్యవర్గం ఎన్నిక కోసం వెంట నే ప్రత్యేక సర్వసభ్య సమావేశం (ఎస్‌జీఎం) నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు 108 మంది సభ్యుల సంతకాలతో సింగిల్ మెన్ కమిటీకి వినతిపత్రం సమర్పించినట్లు వెల్లడించారు. అయితే ఇప్పటివరకు కమిటీ నుంచి స్పందన రాలేదని తెలిపారు. ముందుగా ఎస్‌జీఎం నిర్వహించాలనీ, అసోసియేషన్ నిబంధనల్లో అవసరమైన మార్పు లు చేసిన అనంతరం ఏజీఎం నిర్వహించాలని కోరారు.