ఆసియా క్రీడలపై జిమ్నాస్ట్ ప్రణతి గురి
ఒడిషా ఏఎంఎన్‌ఎస్ సెంటర్‌లో ముమ్మర సాధన
భువనేశ్వర్, సెప్టెంబర్ 15: ప్రతిష్ఠాత్మక ఆసియా క్రీడ(Asian Games)లకు సమయం దగ్గర పడుతోంది. ఈ మెగా ఈవెంట్ కోసం భారత స్టార్ జిమ్నాస్ట్ ప్రణతి నాయక్(Indian star gymnast Pranati Nayak) భువనేశ్వర్‌లోని ఒడిషా ఏఎంఎన్‌ఎస్ ఇండియా జిమ్నాస్టిక్స్ హై పెర్ఫార్మెన్స్ సెంటర్‌లో ముమ్మరంగా సాధన చేస్తోంది. ఏషియన్ గేమ్స్ కోసం ఎంపికైన ఏకైక ఇండియన్ జిమ్నాస్ట్ ప్రణతి మాత్రమే.
ఆమె ఆర్టిస్టిక్ జిమ్నాస్టిక్స్‌లో విమెన్స్ వాల్ట్, విమెన్స్ ఆల్ -అరౌండ్ విభాగాల్లో పోటీ పడనుంది. ఉజ్బెకిస్తాన్ వరల్ ఛాలెంజ్ కప్ 2026లో విమెన్స్ వాల్ట్‌లో రజత పతకం సహా ఆమె కనబరచిన పలు ప్రదర్శనలతో ఆసియా క్రీడలకు ఎంపికైంది. ఏఎంఎన్‌ఎస్ ఇండియా జిమ్నాస్టిక్స్ హై పెర్ఫార్మెన్స్ సెంటర్‌లో అత్యుత్తమ ప్రమాణాలతో ప్రణతి ట్రైనింగ్ పొందుతోంది.
ఆసియా క్రీడలకు ఎంపికైన ఏకైక జిమ్నాస్ట్ తమ హై పెర్ఫార్మెన్స్ సెంటర్ నుంచే ఉండటం గొప్ప విజయమని సెంటర్ డైరెక్టర్ అషుతోష్ తెలంగ్ చెప్పారు. తమ హై పెర్ఫార్మెన్స్ సెంటర్‌లో, ఉన్నతమైన స్థాయిలో పోటీ చేయడానికి అవసరమైన శిక్షణ, మద్దతును అథ్లెట్లకు కేటాయించడానికి తాము ప్రాధాన్యం ఇస్తామని తెలిపారు. ఆసియా క్రీడల్లో ప్రణతి అత్యుత్తమ ప్రదర్శన కనబర్చాలని ఆకాంక్షించారు. 2025లో ఆమె ఏషియన్ ఆర్టిస్టిక్ జిమ్నాస్టిక్స్ చాంపియన్ షిప్, అప్పరటస్ వరల్డ్ కప్‌లో కాంస్యం గెలుచుకుంది.