ఆకీబ్ నబీ, నమన్ ధీర్‌లకు పిలుపు

17-09-2026 | 05:15am
  1. పంత్‌కు నో ప్లేస్
  2. హార్దిక్ పాండ్యా కూడా దూరం
  3. విండీస్‌తో వన్డే, టీ20లకు జట్టు ప్రకటన

ముంబై , సెప్టెంబర్ 16 : వెస్టిండీస్‌(West Indies)తో జరగనున్న పరిమిత ఓవర్ల సిరీస్ కోసం భారత క్రికెట్ జట్టు(Indian cricket team)ను ప్రకటించారు. వన్డే ఫార్మాట్(ODI format) కోసం ఎంపిక చేసిన జట్టులో వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్‌(Rishabh Pant)కు స్థానం దక్కకపోగా, దేశవాళీ క్రికెట్‌లో అదరగొట్టిన ఇద్దరు యువ ప్లేయర్లకు తొలిసారి పిలుపునిచ్చారు. ఆకీబ్ నబీ(Aaqib Nabi), నమన్ ధీర్(Naman Dhir) తొలిసారి జాతీయ వన్డే జట్టుకు ఎంపికయ్యారు. సీనియర్ ప్లేయర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ వన్డే జట్టులోకి తిరిగి వచ్చారు. స్టార్ వికెట్ కీపర్ రిషబ్ పంత్‌కు మాత్రం నిరాశే మిగిలింది.

సెలెక్టర్లు బ్యాకప్ కీపర్‌గా ధ్రువ్ జురెల్‌కు అవకాశం కల్పించారు. పంత్‌ను ఇరానీ కప్‌లో రెస్ట్ ఆఫ్ ఇండియా  కెప్టెన్‌గా ఎంపిక చేశారు. మరోవైపు హార్దిక్ పాండ్యా ఇంకా పూర్తి ఫిట్‌నెస్ సాధించకపోవడంతో జట్టులోకి రాలేదు. వన్డేల సిరీస్‌లో భారత జట్టు శుభ్మన్ గిల్ కెప్టెన్సీలో బరిలోకి దిగనుంది. ఆసియా క్రీడలలో పాల్గొంటున్న కారణంగా శ్రేయస్ అయ్యర్, జస్ప్రీత్ బు మ్రా ఈ వన్డే సిరీస్‌కు అందుబాటులో లేరు. దాంతో కేఎల్ రాహుల్ వైస్ కెప్టెన్‌గా వ్యవహరిస్తారు. కాగా విండీస్‌తో వన్డే సిరీస్ సెప్టెంబర్ 27 నుంచి మొదలవుతుంది.

భారత వన్డే జట్టు

గిల్ (కెప్టెన్), రోహిత్ శర్మ, కోహ్లీ, రుతురాజ్, కేఎల్ రాహుల్ (వైస్ కెప్టెన్), ధ్రువ్ జురెల్, నితీశ్ కుమార్ రెడ్డి, జడేజా, కుల్దీప్ యాదవ్, ప్రసి ద్ధ్ కృష్ణ, గుర్నూర్ బ్రార్, సిరాజ్, ఆకిబ్ నబీ, జైస్వాల్, నమన్ ధీర్.

భారత టీ20 జట్టు

 శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), అభిషేక్ శర్మ, వైభవ్ సూర్యవంశీ, ఇషాన్ కిషన్, సంజు శాంసన్, తిలక్ వర్మ (వైస్ కెప్టెన్), దూబే, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, నితీశ్ కుమార్ రెడ్డి, అర్షదీప్ సింగ్, ప్రిన్స్ యాదవ్, మయాంక్ యాదవ్.

మరిన్ని వార్తలు