ప్రీతి రెడ్డి ఫ్లెక్సీ.. బీఆర్ఎస్‎లో చిచ్చు

17-09-2026 | 02:00pm

కేసీఆర్,కేటీఆర్ ఫోటోలు లేకుండా ప్లెక్సీల ఏర్పాటు

ఆగ్రహం వ్యక్తం చేసిన బిఆర్ఎస్ పార్టీ నాయకులు,కార్యకర్తలు

కుత్బుల్లాపూర్, సెప్టెంబర్ 17(విజయక్రాంతి): మల్లారెడ్డి కోడలు(Malla Reddys daughter) ప్రీతి రెడ్డి పుట్టినరోజు సందర్భంగా ప్లెక్సీలలో తమ అభిమాన నాయకుల ఫోటోలు లేకుండా, పక్క నియోజకవర్గాల ఎమ్మెల్యేల ఫోటోలను వేసుకొని ప్లెక్సీ ఏర్పాటు చేయడంపై బిఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని ఐడిపిల్ చౌరస్తా, సుచిత్ర ప్రాంతాలలో ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు.

తమ సొంత వ్యాపారాల అభివృద్ధికై గత రెండు దశాబ్దాలుగా పూటకో పార్టీ, గంటకో మాట మాట్లాడే మల్లారెడ్డికి ఫ్లెక్సీ ఏర్పాటులో లోపాలు కనిపించలేదా అని మండిపడ్డారు. ప్రోటోకాల్ పాటించకుండా మా పార్టీ అధినేత కేసీఆర్(Kalvakuntla Chandrashekar Rao), వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ , బీఆర్ఎస్ ఎల్పివిప్, స్థానిక ఎమ్మెల్యే కె.పి.వివేకానంద్, మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు  ఫోటోలు లేకుండా మల్లారెడ్డి, మర్రి రాజశేఖర్ రెడ్డి  ఫోటోలు మాత్రమే వేయడం పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించడమేనని విమర్శించారు.

స్థానిక ప్రజాప్రతినిధుల ఫోటోలు లేకుండా ఎక్కడో పక్క నియోజకవర్గ ఎమ్మెల్యేల ఫోటోలు వేస్తే మేమెట్లా ఊరుకుంటామని ఉద్యమ కారులు, పార్టీ కార్యకర్తలు ఫ్లెక్సీలను చించివేశారు. మా పార్టీ అధినేతలను, స్థానిక ప్రజా ప్రతినిధులను విస్మరించి మరొక మారు ఫ్లెక్సీలను మల్లారెడ్డి, మల్లారెడ్డి కుటుంబ సభ్యులు ఏర్పాటు చేస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోక తప్పదని హెచ్చరించారు.

మరిన్ని వార్తలు