విద్యుత్ కోతలపై రైతుల ఆగ్రహం
17-09-2026 | 01:11pm
చందుపట్ల సబ్‌స్టేషన్‌ను ముట్టడించిన..
బీఆర్ఎస్ రైతు విభాగం నాయకులు, రైతులు
చివ్వెంల, సెప్టెంబర్ 17 (విజయక్రాంతి): చివ్వెంల మండలం చందుపట్ల సబ్‌స్టేషన్(Chandupatla Substation)ను బీఆర్ఎస్ రైతు విభాగం నాయకులు, రైతులు ముట్టడించారు. చందుపట్ల, మొగ్గయ్యగూడెం, భీమ్లాతండా గ్రామాల్లో గత నెల రోజులుగా నిరంతరాయంగా విద్యుత్ కోతలు విధిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యుత్ కోతలతో పంటలు ఎండిపోతున్నాయని, రాత్రివేళల్లోనూ కరెంటు కోతల కారణంగా పొలాలకు నీరు పారించలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.