ముప్పేలేదంటున్న ట్రంప్..! ఏఐ స్పీడ్‌కు బ్రేక్‌లు పడతాయా?

17-09-2026 | 01:18pm

ఏఐ వేగం ఆపాలంటున్న టెక్ కంపెనీలు

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(Artificial intelligence) అభివృద్ధి వేగం ఆపాలని టెక్ కంపెనీల(Tech companies) అధిపతులు పేర్కొంటున్నారు. ప్రపంచ దేశాలు ఒప్పందాలు చేసుకోవాలని ఆంథ్రోపిక్ సీఈవో(Anthropic CEO) సూచించారు. ఆచరణలో సాధ్యమేనానని నిపుణులు సందేహం వ్యక్తం చేస్తున్నారు. ఏఏఐతో ముప్పే లేదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(US President Donald Trump) లైట్ తీసుకుంటున్నారు. ఏఐ అభివృద్ధిలో చైనాతో అమెరికా పోటీపడుతోందని ట్రంప్ వెల్లడించారు.

అంతా కలిసి ఏఏఐని నియంత్రించాలని చైనా సూచించింది. భద్రత కోసం ఏఐ పురోగతిని కాస్త నెమ్మదింపజేయాలని ఆల్ట్ మన్ పేర్కొన్నారు. భద్రత కోసం చేసే ఈ ఖర్చు మానవాళి భవిష్యత్తుకు పెట్టే పెట్టుబడని సూచించారు. కృత్రిమ మేధస్సు వేగంగా అభివృద్ధి చెందుతుండటంతో ఐటీ, క్రియేటివిటీ ఉద్యోగాలు కోల్పోతామనే ఆందోళన ప్రపంచవ్యాప్తంగా కలకలం రేపుపతోంది. అసలు ఏఐ స్పీడ్‌కు బ్రేక్‌లు పడతాయా? చూడాల్సి ఉంది.

మరిన్ని వార్తలు