సెప్టెంబర్ 17తెలంగాణా చరిత్రలో చారిత్రాత్మక రోజు
స్వేచ్ఛ, స్వాతంత్ర్యాల కోసం ఉద్యమ చరిత్రను భావితరాలకు అందించాలి:గండ్ర జ్యోతి
భూపాలపల్లి టౌన్,సెప్టెంబర్ 17(విజయక్రాంతి): సెప్టెంబర్ 17తెలంగాణా చరిత్రలో చారిత్రాత్మక రోజని వరంగల్ రూరల్ జిల్లా మాజీ జెడ్పి ఛైర్పర్సన్(Former District ZP Chairperson), బీఆర్ఎస్ పార్టీ జయశంకర్ భూపాలపల్లి జిల్లా మాజీ అధ్యక్షురాలు శ్రీమతి గండ్ర జ్యోతి అన్నారు.తెలంగాణ జాతీయ సమైక్యత దినోత్సవం సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో నిర్వహించిన వేడుకల్లో గండ్ర జ్యోతి ముఖ్య అతిధిగా పాల్గొని జాతీయ జెండా ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా జ్యోతి మాట్లాడుతూ.. నిజాం పాలనలో హైదరాబాద్ సంస్థానాన్ని భారతదేశంలో విలీనం చేయడానికి ప్రజలు చేసిన పోరాటాలు,త్యాగాలను స్మరించుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు.
ఆనాడు పరకాల గడ్డపై జరిగిన పోరాటంలో అమరులైన వీరుల త్యాగాలను గుర్తుచేస్తూ, పరకాల పోరాటాన్ని రెండో జలియన్ వాలాబాగ్గా అభివర్ణిస్తారని తెలిపారు. తెలంగాణ సాధన కోసం 1969 లో జరిగిన ఉద్యమం, 2001 లో కేసీఆర్ నాయకత్వంలో ప్రారంభమైన మలిదశ ఉద్యమం, తెలంగాణ రాష్ట్ర సాధనలో కేసీఆర్ పోరాటాన్ని, వారి స్ఫూర్తితో తెలంగాణ రాష్ట్ర ప్రజలందరు ఏకమై రాష్ట్రాన్ని సాధించుకున్నామని అన్నారు.
ప్రజాపాలన పేరుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేస్తుందా అనేది ప్రజలు గమనించాలని అన్నారు.
రాబోయే రోజుల్లో కేసీఆర్ నాయకత్వాన్ని బలపరుస్తూ ప్రజలను చైతన్యపరిచే కార్యక్రమాలను చేపడతామని ఈ సందర్భంగా గండ్ర జ్యోతి తెలిపారు.