సిద్దిపేట రోడ్డుపై ట్రాఫిక్ జామ్.. వాహనదారులు, విద్యార్థుల అవస్థలు!
22-09-2026 | 12:31pm
రామాయంపేట,(విజయక్రాంతి): ఈరోజు ఉదయం స్కూల్ సమయం కావడంతో రామాయంపేట సిద్దిపేట రోడ్డులో సుమారు 45 నిమిషాల పాటు భారీగా ట్రాఫిక్ జామ్(Traffic jam) ఏర్పడింది. దీంతో స్కూల్‌కు వెళ్లే విద్యార్థులు(students), ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వాహనాలు(Vehicles) కదలకపోవడంతో సమయానికి గమ్యస్థానాలకు చేరుకోలేని పరిస్థితి నెలకొంది. ప్రతిరోజూ ఇదే పరిస్థితి పునరావృతం కాకుండా సంబంధిత అధికారులు వెంటనే స్పందించి ట్రాఫిక్ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని విద్యార్థులు, ఉద్యోగులు, వాహనదారులు కోరుతున్నారు. సిద్దిపేట రోడ్డుపై ట్రాఫిక్ కష్టాలకు ఇకనైనా చెక్ పడుతుందా? అధికారులు వెంటనే స్పందించాలి.