గణేష్ శోభాయాత్ర.. నిమజ్జనానికి ప్రత్యేక ఏర్పాట్లు
300 మంది పోలీసులతో బందోబస్తు
జిల్లా వ్యాప్తంగా 815 విగ్రహాల ఏర్పాటు
డీజేలకు అనుమతి లేదు
ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్
ములుగు,(విజయ క్రాంతి): గణేష్ శోభాయాత్ర(Ganesh procession).. నిమజ్జనం కోసం అన్ని శాఖల సమన్వయంతో నిమజ్జనం ప్రశాంతంగా జరిగేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టినట్టు జిల్లా ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్(SP Sudhir Ramnath Kekan) తెలిపారు. ఈ మేరకు మంగళవారం ప్రకటన విడుదల చేశారు. డీజేలకు ఎలాంటి అనుమతి లేదని స్పష్టం చేశారు. జిల్లావ్యాప్తంగా 815 విగ్రహాలు ఆన్లైన్లో నమోదు జరిగిందని, జియో ట్యాగింగ్ జరిగిందని తెలిపారు. ఇప్పటికే నిమజ్జనం కోసం ప్రత్యేక ప్రదేశాలను గుర్తించి అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు.
ప్రతి ఒక్కరు పోలీస్ శాఖ సూచనలను పాటించాలని సూచించారు. గణేష్ ఉత్సవాలు భక్తి, శాంతి.. సోదర భావానికి ప్రతీకగా నిలవాలని ఇందుకు ప్రతి ఒక్కరు బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు. ప్రజల భద్రత కోసం పోలీస్ శాఖ నిరంతరం కృషి చేస్తుందని ఈ సందర్భంగా స్పష్టం చేశారు. రెవెన్యూ, మున్సిపల్, పోలీస్ శాఖ ఇతర శాఖల సమన్వయంతో గణేష్ శోభాయాత్రను భక్తులు ప్రశాంతంగా జరుపుకోవాలని తెలిపారు.