వినాయక నిమజ్జనానికి పకడ్బందీ ఏర్పాట్లు
22-09-2026 | 01:21pm
వనపర్తి,(విజయక్రాంతి): వనపర్తి(Wanaparthy) పట్టణంలో వినాయక నిమజ్జన కార్యక్రమాన్ని ప్రశాంత వాతావరణంలో నిర్వహించేలా పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి(Collector Adarsh Surabhi) అధికారులను ఆదేశించారు. మంగళవారం నల్లచెరువు ట్యాంక్‌బండ్(Nallacheruvu tank bund)ను పరిశీలించిన ఆయన భద్రత, ట్రాఫిక్ నియంత్రణ, బారికేడింగ్, పార్కింగ్, తాగునీరు, పారిశుద్ధ్యం, వైద్య సదుపాయాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. నిమజ్జనానికి భారీ క్రేన్లు వినియోగించాలని, పోలీస్, మున్సిపల్, రెవెన్యూ, వైద్య, విద్యుత్ శాఖలు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. కార్యక్రమం అనంతరం వ్యర్థాలను వెంటనే తొలగించాలని సూచించారు.