గజ్వేల్ లో ఘనంగా పితృ అమావాస్య, బతుకమ్మ పండుగ

10-10-2026 | 08:10pm

గజ్వేల్ అక్టోబర్ 10: గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ(Gajwel Pragnapur Municipality) తో పాటు డివిజన్ వ్యాప్తంగా పితృ అమావాస్య పర్వదినాన్ని ప్రజలు ఘనంగా జరుపుకున్నారు. మరణించిన తమ పూర్వీకులను భరించుకుంటూ వివిధ రూపాలలో దానాలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. పితృ అమావాస్య రోజున బతుకమ్మ పేర్చడం ప్రారంభమవుతుంది.

మహిళలు తంగేడు గునుగు, బంతి చేమంతి వివిధ పూలతో అందంగా బతుకమని తయారుచేసి, ముస్తాబై వీధులలో చెరువు గట్లపై బతుకమ్మ ఆట ఆడారు. బతుకమ్మ తోడుగా తీసుకొచ్చిన గౌరమ్మను ఒకరికొకరు పంచుకొని, తమ వెంట తీసుకువచ్చిన ప్రసాదాలను ఆరగించారు. గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ పరిధిలోని పాండవుల చెరువు మినీ ట్యాంక్ బండి(Mini Tank Bund) పై బతుకమ్మ పండుగ ప్రారంభం కావడంతో సందడి నెలకొంది. భారీ సంఖ్యలో మహిళలు బతుకమ్మలతో తరలి రావడంతో మినీ ట్యాంక్ బండ్ పూలవనంగా మారింది.

మరిన్ని వార్తలు