ఆపరేషన్ కవచ్ పాయింటును తనిఖీ చేసిన ఎస్పీ

23-11-2026 | 05:20pm

అప్రమత్తంగా ఉండాలని పిలుపు 

కామారెడ్డి, నవంబర్ 23 (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఆపరేషన్  కవచ్ పాయింట్ సెంటర్ ను(Operation Kavach Point Center) కామారెడ్డి జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర ఆదివారం అర్ధరాత్రి తనకి చేశారు. రోడ్డుపై వచ్చే వాహనదారులను తనిఖీ చేస్తున్నారా లేదా అనే విషయాన్ని అర్ధరాత్రి ఆకస్మికంగా తనిఖీ చేసి చూశారు. ఈ సందర్భంగా విధుల్లో ఉన్న సిబ్బందితో మాట్లాడారు.

అప్రమత్తంగా ఉంది విధులు నిర్వహించాలని సూచించారు. పట్టణంలోకి వచ్చే వాహనాలను, వెళ్లే వాహనాలను, క్షుణ్ణంగా తనిఖీ చేయాలని ఆదేశించారు. అనుమానస్పద వ్యక్తులు అనిపిస్తే విచారించాలన్నారు. ఆపరేషన్ కవచ్ ఉద్దేశాన్ని ప్రజలకు ఉపయోగపడే విధంగా విధులు నిర్వహించి మంచి పేరు తీసుకురావాలన్నారు. వీధుల్లో ఉన్న సిబ్బందిని అభినందించారు. చలి నీ లేక చేయకుండా విధులు నిర్వహిస్తున్న ఆపరేషన్ కవచ్ సిబ్బంది పనితీరును ఎస్పి రాజేష్ చంద్ర పరిశీలించారు.

మరిన్ని వార్తలు