ఘనంగా సద్దుల బతుకమ్మ వేడుకలు
రాజాపూర్ అక్టోబర్ 19: మండలంలోని తిరుమలాపూర్ గ్రామంలో సోమవారం సద్దుల బతుకమ్మ(Saddula Bathukamma) వేడుకలను ఘనంగా నిర్వహించారు. గ్రామ మహిళలందరూ ప్రకృతిలో దొరికే తంగేడు గునుగు బంతి వంటి రంగురంగుల పూలతో బతుకమ్మలను పూలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. మహిళలందరూ బతుకమ్మలను ఊరేగింపుగా భ్రమరాంబ మల్లికార్జున స్వామి దేవాలయం చేరుకొని బతుకమ్మ ఆటలు, కోలాటం ఆటపాటలతో సద్దుల బతుకమ్మ వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించారు. అనంతరం మహిళలందరూ గ్రామ సమీపంలోని చెరువు దగ్గరకు వెళ్లి బతుకమ్మలను నిమజ్జనం చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ సంతోష వెంకటేష్, ఉప సర్పంచ్ రామచందర్, మాజీ సర్పంచులు మహేశ్వరి మహిపాల్ రెడ్డి రామకృష్ణ గౌడ్ గ్రామ పెద్దలు యువతి యువకులు పాల్గొన్నారు.